Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రేజ్: పవన్ ని ఫాలో చేస్తున్న అభిషేక్ బచ్చన్
హైదరాబాద్ : కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన తొలి ట్వీట్ చేశారు. అలా అకౌంట్ ప్రారంభించగానే వేల మంది అభిమానులు ఆయనను ఫాలో అవడం ప్రారంభించారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా ఆయన్ను ట్విట్టర్ లో ఫాలో అవటం మొదలెట్టారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ఇక తెలుగు రాష్ట్రాలకు పవన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్నికల కంటే ముందు కేవలం నటుడిగా మాత్రమే ముద్ర పడిన పవన్ కళ్యాణ్ తరువాత రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందడం విశేషం. ఆయన కాలు కదిపినా, నోరు తెరిచినా సంచలనమే.. చివరకు ట్విట్ చేసినా సంచలనమేనని స్పష్టం అవుతోంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ ను 70 వేల మంది ఫాలో అయ్యారంటే మాటలా..! అదే మరి పవర్ స్టారంటే.. అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంటర్ అవ్వడంతో ఇందాస్త్రీలోని సెలబ్రిటీలు అందరూ ఆయనకి సోషల్ నెట్వర్క్ లోకి స్వగతం పలికారు. అలాగే అభిమానులు ఎంతో అనడంతో #PawanKalyanOnTwitter అంటూ ఇండియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన 15 గంటల్లోనే పవన్ కళ్యాణ్ కి 56 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే https://twitter.com/PawanKalyan ఐడిని ఫాలో అవ్వండి.

పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ఈ చిత్రం విడదులకు ఎక్కవ సమయం కూడా లేదు. దాంతో మిగిలిన షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ మీద కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని ఈ షెడ్యూల్ లో ఫినిష్ చేసేస్తామని అంటున్నారు. సంక్రాంతికి ఎట్టి పరిస్ధితుల్లోనూ విడుదల చేస్తామని చెప్తున్నారు.

చిత్రం విడుదల విషయానికి వస్తే... సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ముందుగా ప్రకటించారు. కానీ పవన్, వెంకటేష్ అభిమానులను అలరించడానికి కాస్త ముందుగానే అంటే జనవరి 9న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఎలాగూ ఈ సినిమాను ముందుగా విడుదల చేయడానికి ప్లాన్ చేయడంతో గోపాలగోపాల పాటల ఆవిష్కరణ కార్యక్రమం కూడా తొందరగా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు.
శరత్ మరార్ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్ పవన్‌కల్యాణ్ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.
ఇక గోపాల గోపాల సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రంలో సాంగ్స్ లేకుండా చేద్దామనుకున్నా సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్ చేసినట్లు చిత్ర యూనిట్ టాక్. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. మరో మూడు పాటలు చరణాలు మాత్రమే వినబడి బిట్స్ లాగా అనిపిస్తాయంట.
మరీ వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే జనవరి (విడుదల) వరకు ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్ వారణాసిలో చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో కూడా ఎవరి ఊహకు అందనంతంగా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
చిత్రం కథ విషయానికి వస్తే..
దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది.
అలాగే...పవన్ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.