»   »  అభిమానులకే అంకితం అంటూ ప్రకటించిన పవన్

అభిమానులకే అంకితం అంటూ ప్రకటించిన పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ అంటే ఆయన అభిమానులు ప్రాణం ఇస్తారు. అదే విధంగా పవన్ సైతం ఆయన అభిమానుల కోసం ఏదైనా చేయటానికి నేను సిద్దం అన్నట్లు ఉంటారు. ఎప్పుడూ ఆయన అభిమానులను తలుచుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన తన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ నిసైతం అభిమానులకే అంకితం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత శరద్ మరార్ తన ట్వీట్ తో తెలియచేసారు.


అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని చెబుతూ వస్తోన్ననిర్మాత, ముందే ప్రకటించినట్లుగా ఏప్రిల్ 8నే సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను పూర్తి చేసేసి ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ షూట్ జరుపుకుంటోంది.
Pawan dedicates Sardaar film to his fans

హైద్రాబాద్‌లోని ఓ పురాతన భవనం లో పవన్ తో పాటు ఇతర భారీ తారాగణం అంటూ పాల్గొంటూ ఉండగా క్లైమాక్స్ ఫైట్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రాం లక్ష్మణ్ ఇద్దరూ ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసారు.

ఈ క్లైమాక్స్ తరవాత పవన్ కళ్యాణ్ - కాజల్ ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నారు. ఇక స్విట్జర్లాండ్ షెడ్యూల్‍తో సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు 'పవర్' ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

English summary
Sharrath Marar tweeted: "#SardaarGabbarSingh climax in progress. #PawanKalyan dedicates the film to his fans who stood by him all these years "
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu