twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్షన్ లో పవన్ వేలుపై 'పంజా' విలన్

    By Srikanya
    |

    డైరక్షన్ లో పవన్‌కళ్యాణ్‌ కలుగజేసుకుంటారని చాలామంది చెప్పారు. నా పరిశీలనలో అది తప్పని తేలింది. పని విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు అంటున్నారు పంజా విలన్ అడవి శేషు. ఆయన పంజా ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ..పవన్ మాటల్లో, చేతల్లో నిజాయితీ కనిపించింది. ఇగోలేని మనిషి. నన్ను చూసి నటుడిగా కంటెన్యూ చేయి, నీ హెయిర్‌ చాలా బాగుంటుంది...అని ప్రశంసించారు. అలాగే ఓ సారి షూటింగ్‌లో ఫైట్స్‌ చేస్తుంటే కాలు బెణికింది. రెస్ట్‌ తీసుకోకుండా, షూటింగ్‌ను పూర్తిచేశారు అన్నారు.

    ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే ఇది దర్శకుడు విష్ణువర్ధన్‌ విజన్‌లోంచి వచ్చింది. ఇందులో నా పేరు మున్నా..ఇండియా వచ్చిన ఎన్‌.ఆర్‌.ఐ. నా నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్ర.పవన్‌కళ్యాణ్‌తో మొదట నటించేటప్పుడు టెన్షన్‌ పడ్డాను. పైగా నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర. కొత్తవాడినన్న ఆలోచనలేకుండా చాలా సరదాగా ప్రవర్తించేవాడు. షూటింగ్‌ కొల్‌కత్తా, ఫిలింసిటీలో జరిగింది. దర్శకుడు విష్ణువర్ధన్‌. నా పాత్ర ఎక్కువగా జాకీష్రాఫ్‌తో ఉంటుంది. హీరోయిన్‌ అంజనీతో సన్నివేశాలున్నాయి. పంజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌' అని అన్నారు.

    సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా పంజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సారాజేన్‌ డైస్‌, అంజని లావని హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించిన విష్ణువర్థన్‌ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే చాలా భాగం షూటింగ్ చేసారు. ఈ చిత్రంలో పవన్‌ పాత్ర చిత్రణ, వేషధారణ కొత్త పంథాలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా.

    English summary
    Adavi Sheshu happy to work with Pawan Kalyan in Panja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X