»   » పవన్ ఎంట్రీతో మెగా సినిమాలు మెగాసంబరాలు..!

పవన్ ఎంట్రీతో మెగా సినిమాలు మెగాసంబరాలు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మగధీర తర్వాత వచ్చిన మెగా చిత్రాలన్నీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. గత ఏడాది అయితే మెగా ఫ్యాన్స్ ని దారుణంగా హింసించి వెళ్లిపోయింది. వరుడు, పులి, ఆరెంజ్..మూడూ డిజాస్టర్ సినిమాలుగా రికార్డులకెక్కి ఫ్యాన్స్ ని విపరీతంగా కుంగదీశాయి. కానీ ఈ ఏడాదికి పవన్ ఎంట్రీతో వారికి మంచి స్టార్ట్ లభించింది.

మొన్న విడుదలైన 'తీన్ మార్"కి మంచి టాక్ వినిపిస్తోంది. ఏసెంటర్స్ లో హిట్, బి సెంటర్స్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న 'తీన్ మార్" పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో మంచి రేంజ్ కి వెళుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఖుషీ తర్వాత వచ్చిన చిత్రాల్లో జల్సా తప్ప మరో హిట్ లేని పవన్ కళ్యాణ్ కి తీన్ మార్ విషయంలో పాజిటివ్ టాక్ రావడం అభిమానుల్ని ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది.

ఇక తదుపరి వచ్చే అల్లు అర్జున్ సినిమా బద్రినాథ్ పై కూడా మంచి అంచనాలున్నాయి. అలాగే పవన్ షాడో, చరణ్ రచ్చ కూడా ఇదే ఏడాదిలో విడుదల కానున్నాయి. దాంతో ఈ ఏడాది అంతా తీన్ మారేలే అని అభిమానులు సంబరపడిపోతున్నారు...

English summary
This is all time high craze for Power Star. As verdict of ‘Teen Maar’ is unanimously arriving as positive, Pawan Kalyan Fans are on cloud nine enjoying every moment of this success. Even general audiences bored by sick story lines are refreshed by this magical touch of Trivikram and Jayant C Paranji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu