»   » వర్మ చనిపోయాడు...నివాళి అంటూ ట్వీట్స్

వర్మ చనిపోయాడు...నివాళి అంటూ ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చనిపోయాడు,నివాళి అంటూ ట్వీట్స్ అందరినీ విస్తుపరిచాయి. అయితే అవి పవన్ ఫ్యాన్స్ చేసిన పని. పవన్ అభిమానులకు,రామ్ గోపాల్ వర్మ కు గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు ఇలా బహిరంగమయ్యింది. పవన్ ని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ కు హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇందులో ఇంకా విశేషమేమిటంటే...ఈ ట్వీట్ ని వర్మే షేర్ చేయటం.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చిత్రాల విషయానికి వస్తే....

రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం గంధపు చెక్కల స్మగ్లర్ .. వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరి మన్ననలూ అందుకుంటోంది.

అలాగే...మాఫియా చిత్రాలతో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా వేరే తరహా చిత్రాలపై దృష్టి పెట్టారు. అయితే తాజాగా మళ్లీ మరోసారి మాఫియా చిత్రాల వైపు తన ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన అండర్ వరల్డ్ బాహుబలి అని చెప్పుకునే బెంగుళూరు మాఫియా డాన్ జీవితంపై చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Pawan Fans tweet about RGV

ముత్తప్పరాయ్ ..నా దృష్టిలో అండర్ వరల్డ్ బాహబలి అన్నారు. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను..గాఢ్ ఫాధర్ అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ అని..కానీ ముత్తప్ప రాయ్ ని కలిసిన తర్వాత ..ఆయన నిజమే అని..ఆయన గాఢ్ ఫాదర్స్ కు గాఢ్ ఫాధర్ అని తెలుసుకున్నాను. ఈ సినిమాకు ‘అప్పా' అనే పేరు పెడతా . ఫాదర్ ఆఫ్ ఆల్ ది గాడ్‌ఫాదర్స్ అనేది ట్యాగ్‌లైన్.

బెంగళూరు నేపథ్యంలో అండర్ వరల్డ్‌కు సంబంధించిన వారి గురించి తెలుసుకోవడం జరిగిందని, ముంబై అండర్ వరల్డ్ కంటే ఈ బెంగళూర్ అండర్ వరల్డ్ ఇంకా ఎక్కువ బలమైనదని వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముత్తప్పా రాయ్ అనే బెంగళూరుకు చెందిన, గతంలో అండర్ వరల్డ్ డాన్‌గా పేరుమోసిన వ్యక్తిని. దావూద్ కంపనీ కన్నా పెద్దదైన బీ-కంపనీ ఇది..

English summary
Pawan Fans tweet and share that RGV is DIed and RIP.
Please Wait while comments are loading...