»   » పవన్ కళ్యాణ్ బట్టలు వేలానికి.... మొన్న కారు.., ఇప్పుడు గబ్బర్ సింగ్ కాస్ట్యూమ్స్ అమ్మకానికి

పవన్ కళ్యాణ్ బట్టలు వేలానికి.... మొన్న కారు.., ఇప్పుడు గబ్బర్ సింగ్ కాస్ట్యూమ్స్ అమ్మకానికి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నటికి మొన్న ఆర్థికంగా చిక్కుల్లో ఉండి త్న కారు అమ్మేసాడంటూ వచ్చిన వార్తలు ఇంకా పాత బడకముందే వచ్చిన ఒక న్యూస్ మరో సారి అభిమానులని ఉలిక్కి పడేలా చేసింది. పవన్ కళ్యాణ్ వేసుకున్న బట్టలును వేలం పాట వేయనున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ చిత్రంలో పోలీస్ డ్రస్ ని ఇందుకు ఎంచుకున్నారు. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం కాదులెండి సమంతా నిర్వహించే "ప్రత్యూష" ఫౌండేషన్ కోసమట.

ఈ వేలం పాట నిజనికి సినిమా షూటింగ్ టైం లోనే ఈ ప్రపోజల్ అనుకున్నా ఇప్పటికి వేలం పాటకి సమయం కుదిరిందన్నమాట.. చెన్నయ్ అందాలభామ సమంత సమాజ సేవా కార్యక్రమాల కోసం. అందుకు క‌థానాయ‌కుల ఒంటిపై బ‌ట్టలూడ‌దీసి వేలానికి పెట్టే కార్యక్రమాన్ని షురూ చేసింది. హైదరాబాదులోని ప్రత్యూష ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ నిమిత్తం సినీ తారల దుస్తులను వేలం వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.

Pawan Gabbar singh Dress put to auction by Samantha

మొదట తన దుస్తులను వేలానికి పెట్టిన సమంత ఇటీవల 'గ‌బ్బర్‌సింగ్'గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేసుకొన్న పోలీస్ యూనిఫామ్‌ని సొంతం చేసుకొని వేలానికి పెట్టింది. ఇప్పుడు తాజాగా 'దూకుడు'లో మహేష్ బాబు వేసుకొన్న దుస్తులను సేకరించినట్లు సమంత తెలిపింది. ఆన్‌లైన్లో జరిపే వేలం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ఓపెన్ చేస్తున్నట్టు ఈ అందాలతార చెప్పింది. గతంలోనూ బాలకృష్ణ సింహా గొడ్డలి వంటివి వేలం వేసి ఆ వచ్చే డబ్బుని పేద కళాకారుల ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. ఈ వేలం పాటలో అభిమానులు ఆనందంగా పాల్గొని మరీ ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తూంటారు..

English summary
“We have been working hard and PratyushaOrg and I are beyond excited to announce a grand auction of items from iconic films used by your favourite stars . Details of the auction will be announced soon,” tweeted Samantha.The first item to go for auction would be Pawan Kalyan’s Gabbar Singh outfit. Samantha even gave a sneak peek by sharing the photograph of it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu