For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛార్టెడ్ ఫ్లైట్ లో ఫ్రెండ్స్ తో పవన్ కళ్యాణ్(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ తన స్నేహితులు ఆర్ట్ డైరక్టర్ ఆనంద సాయి, నిర్మాత శరద్ మరార్ తో కలిసి ఛార్టెడ్ ఫ్లైట్ లో వెళ్తూండగా తీసిన ఫొటో ఇది. వీరు ముగ్గురూ కలిసి ఆనందంతో ఏదో విషయమై డిస్కస్ చేసుకుంటున్నారు. ఆనందసాయి...పవన్ కళ్యాణ్ కి చిననాటి స్నేహితుడు. అలాగే మరో స్నేహితుడు శరద్ మారార్ మరో స్నిహితుడు. ఇప్పుడు ఆయన గోపాల గోపాల, గబ్బర్ సింగ్ 2 కి నిర్మాతగా వ్యవహిస్తున్నారు.

  పవన్ తాజా చిత్రం ‘గోపాల గోపాల' విషయానికి వస్తే...

  వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా క్రితం శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.

  ఈ చిత్రం మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డుని క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ వారాంతానికి ఈ చిత్రం 30 కోట్లు దాటిందని చెప్తున్నారు. తొలివారం 30 కోట్లు దాటి సేఫ్ జోన్ లోకి ప్రవేశించిందని, త్వరలో ఇది లాభాల బాట పడుతుందని చెప్తున్నారు. పవన్ ఎఫెక్ట్, పెంచిన పబ్లిసిటీ డోస్,సంక్రాంతి పండగ ప్రభావం భాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు.

  Pawan Kalyan in a Chartered Flight!

  చిత్రం కథేమిటంటే...

  దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

  దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

  ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటించారు.

  English summary
  Here is the exclusive picture of Pawan Kalyan with his close buddies Art Director Anand Sai and Producer Sarath Marar in a chartered flight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X