twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయం తెలిసి విస్తుపోయాం.. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్

    |

    మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిందనే వార్తలు సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యే ముందు రోజే సీఎం కేసీఆర్‌తో భేటీ, అందులో పలువురు మంత్రులు, నాగార్జున కూడా పాల్గొన్నారు. చిరంజీవి తనకు కరోనా సోకిందనే విషయాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. తనను ఈ మధ్య కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.

    అక్కడకు వెళ్లడంతోనేనా..

    అక్కడకు వెళ్లడంతోనేనా..

    చిరంజీవి ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తాను జాగ్రత్తగా ఉండటమే కాకుండా పక్క వారికి కూడా సూచనలిస్తాడు. అలాంటి చిరంజీవికి కరోనా ఎలా సోకిందంటూ అందరూ ఆరా తీయడం మొదలెట్టారు. రఘు కుంచె కూతురి పెళ్లి వేడుకల్లో చిరంజీవి పాల్గొనడంతో కరోనా సోకి ఉండొచ్చని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

    కరోనాపై ప్రకటన..

    కరోనాపై ప్రకటన..

    ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను' అని చిరంజీవి ప్రకటించాడు.

    కోలుకోవాలంటూ..

    కోలుకోవాలంటూ..

    చిరంజీవికి కరోనా సోకిందనే వార్త తెలిసినప్పటి నుంచి సెలెబ్రిటీలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ట్వీట్లు వేస్తారు. కరోనాను జయించే శక్తిని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నారు. అభిమానులు చిరంజీవి ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు కూడా చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

    విస్తుపోయాం

    విస్తుపోయాం

    అన్నయ్య చిరంజీవి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యంపట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య చిరంజీవి గారు కరోనా బారినపడటంతో మేమంతా విస్తుపోయామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
    సెకండ్ వేవ్

    సెకండ్ వేవ్

    ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. అన్నయ్య చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. మరో వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు.

    English summary
    Pawan Kalyan About Chiranjeevi Tests Corona Positive, Chiranjeevi Tests Corona Positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X