twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవనిజం... గురించి పవన్ కళ్యాణ్ స్పందన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పవనిజం..పవనిజం అంటూ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. పవనిజం అంటే ఏమిటని అభిమానులను అడిగితే రకరకాలుగా సమాధానం ఇస్తున్నారు. మొత్తానికి వారు చెబుతున్న పవనిజంలోని అర్థం ఏమిటంటే పవన్ కళ్యాణ్‌ లా ఉండటం, ఆయన చేస్తున్న మంచి పనులను ఫాలో అవ్వడం, ఆయన లాంటి మంచి వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవడం అని స్పష్టం అవుతోంది.

    తాజాగా పవనిజం అనే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగులో మాటల రచయిత బివిఎస్ రవి ఇదే విషయమై పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిచారు. దానికి పవన్ కళ్యాణ్ ఓ చిరు నవ్వు చిందిస్తూ...'అది అభిమానుల ప్రపంచం' అని సమాధానం ఇచ్చారు.

    మరి మీ అభిమానులకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అని బివిఎస్ రవి ప్రశ్నించగా.... 'నా ఫ్యాన్స్ నాకు ఫంక్షన్స్ చేయక్కర్లేదు, వాళ్ల మనీ ఖర్చు పెట్టక్కర్లేదు, వాళ్ల కళ్లలో ఆనందం చూస్తున్నా...నాకు కావాల్సింది అదే' అని సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్.

    పవన్ తాజా సినిమా విషయానికొస్తే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. పవన్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.

    ప్రకాష్‌ రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

    English summary
    "In #CGR shoot I asked #PSPK wht's #PAWANISM.He smiled n said its d fans' word.then I asked wht's PawanKalyan's message 2 them. He said "Naa fans naaku functions cheyakharledu, vaalla money kharchupettakharledu.i see a shining in d eyes of evry fan.but,I want them to" Bvs ravi tweetted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X