»   » చచ్చిపోవాలనిపించింది, అదే వదినమ్మకు చెప్పా : పవన్ కళ్యాణ్

చచ్చిపోవాలనిపించింది, అదే వదినమ్మకు చెప్పా : పవన్ కళ్యాణ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Pawan Kalyan Talks About His Incidents During Suswagatham

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పోరాట యాత్రను నిర్వహిస్తున్న ఆయన ఏపీలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో గతంలో తన సినీ జవితంలో జరిగిన పలు సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. విశాఖలో ఆయన ప్రసంగిస్తూ సుస్వాగతం సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

   చిన్నతనం నుండి అంతే

  చిన్నతనం నుండి అంతే

  సినిమాల్లోకి రాక ముందు నుండి నా ఆలోచన విధానం సమస్యలపై పోరాడాలనే ఉండేది. ఆ సమయంలో ఇంట్లో ఉండేవాడిని కాదు. తిరుపతిలో లేదా...ఆశ్రమాలు తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు కూడా ఇలాగే గడ్డం ఉండేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

  ఆయన మాటలు నాపై ప్రభావం చూపాయి

  ఆయన మాటలు నాపై ప్రభావం చూపాయి

  సినిమాల్లోకి రావడానికి ముందు ఓ వ్యక్తి నన్ను నువ్వు ఏం చేస్తావంటే... భగవద్గీత దగ్గర నుండి చాలా కథలు చెప్పాను. నీ వ్యక్తిత్వం నిజం అని నేను ఎలా నమ్మాలి అని ఆయన ప్రశ్నించారు. సంపాదన లేదు, సమస్యలు లేవు. అన్నీ సమకూర్చడానికి చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు. సుఖంగా మాట్లాడుతున్నావు. ముందు నీకంటూ ఏదైనా సాధించు. అపుడు నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నారు. ఆయన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. చాలా వాస్తవం ఉంది అనిపించింది అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

  అలా సినిమాల్లోకి వచ్చాను

  అలా సినిమాల్లోకి వచ్చాను

  ఆయన అలా చెప్పడంతో ఏం చేయాలా అని ఆలోచించాను. ఉద్యోగానికి కావాల్సిన చదువు చదువుకోలేదు. డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు. అదే సమయంలో యాక్ట్ చేస్తావా? అని ఒకరు అడిగితే నాకు చాలా సిగ్గు, భయం అని చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వైజాగ్ తీసుకొచ్చారు. సత్యనంద్ గారి వద్ద యాక్టింగ్ శిక్షణ కోసం చేర్పించారు. ఆ సమయంలో స్ట్రీట్ ప్లేస్ చేసేవాడిని. అలా సినిమాల్లోకి వచ్చాను అని పవన్ గుర్తు చేసుకున్నారు.

  ప్రాణం వదిలేయాలనిపించింది అని వదినమ్మకు చెప్పాను

  ప్రాణం వదిలేయాలనిపించింది అని వదినమ్మకు చెప్పాను

  వైజాగ్ నాకు చాలా క్లోజ్. నేను నటనలో ఓనమాలు నేర్చుకుంది ఇక్కడే. జగదాంబ సెంటర్ వద్దకు రాగానే నాకు ఓ విషయం గుర్తుకు వచ్చింది. సుస్వాగతం సినిమా సమయంలో బస్సు మీద నిలబడి డాన్స్ చేయమన్నారు. అలా చెప్పడంతో చచ్చిపోయినంత పనైంది. ఎందుకీ బ్రతుకు అనిపించింది. మా వదినకు ఫోన్ చేసి ప్రాణం వదిలేయాలనిపిస్తోంది, నా వల్ల కాదు ఈ పని చేయడం అని చెప్పాను.... అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

  డాన్స్ రాదు, పోరాటమే వచ్చు

  డాన్స్ రాదు, పోరాటమే వచ్చు

  పది మంది ముందు డాన్స్ చేయడం, నటించడం నా వల్ల కాదు. కానీ మీటింగుల్లో మాట్లాడమంటే మాట్లాడతాను. ప్రజా సమస్యలపై పోరాడటం అనేది నాకు సహజంగా వస్తుంది, డాన్స్ చేయడం సహజంగా రాదు. ఇన్నేళ్లయినా నాకు యాక్టింగ్ అలవాటు కాలేదు, పరిపూర్ణమైన యాక్టర్ ను అని చెప్పుకోలేను. కానీ సమస్యలపై పోరాడటానికి చిన్నప్పటి నుండి సంసిద్ధంగా ఉన్నాను... అని పవన్ అన్నారు.

  English summary
  Pawan Kalyan about Suswagatham movie shooting incident. Suswagatham film produced by R. B. Choudary on Super Good Films banner, directed by Bhimaneni Srinivasa Rao. Starring Pawan Kalyan, Devayani in the lead roles and music composed by S. A. Rajkumar. The film recorded as Super Hit at box office.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more