»   »  పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటో: కొద్దిగా ఒళ్లు చేసినట్లున్నాడే

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటో: కొద్దిగా ఒళ్లు చేసినట్లున్నాడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తన సింగపూర్ వెకేషన్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ లో జూన్ 5 న లాండ్ అయ్యారు. అప్పుడు తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసిన వారు సర్దార్ గబ్బర్ సింగ్ లో కనపడిన పవన్ కు, ఈ పవన్ కు తేడా ఉంది అంటున్నారు. కొద్దిగా ఒళ్లు చేసి, బరువు పెరిగినట్లున్నాడే అంటున్నారు. మీరు కూడా చూసి చెప్పండి.

అలాగే జూన్ 1 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. కంప్లీట్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో లగేజ్ బ్యాగ్ పట్టుకొని డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు. ఆయన ఎయిర్‌పోర్టు చేరుకొనే సరికి అక్కడి వాతావరణం అంతా సందడిగా మారింది. కెమెరాలు క్లిక్‌ల మ‌నిపించారు అభిమానులు. ఆ ఫోటోను మీరు ఇక్కడ చూడవచ్చు.

pawan

పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుండగా, ఈ చిత్రం పొలాచ్చిలో మొదటి షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీ అని చెప్తున్నారు.

మరో ప్రక్క... పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ఎస్.జె.సూర్య సినిమా తర్వాత మరోసారి త్రివిక్రంతో జత కట్టబోతున్నాడు. అయితే ఎన్నో రోజులుగా మూలన పడ్డ కోబలి ప్రాజెక్ట్ ను వారు తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమా కథ సిద్ధం చేసే ఆలోచన చేస్తున్నాడట త్రివిక్రం శ్రీనివాస్ అని చెప్పుకుంటున్నారు.

pavan kalyan

ఇక రీసెంట్ గా అఆ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రం మరోసారి పవర్ స్టార్ ను పవర్ ఫుల్ గా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మధ్యలోనే సూర్యతో సినిమా ఉందని ప్రచారం జరిగినా అది ప్రస్తుతానికి లేనట్లే అంటున్నారు. పవన్ తో త్రివిక్రం చేసే సినిమా కోబలి అంటూ ప్రచారం జరుగుతుంది. పవన్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోందని ఊరిస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న ఎస్.జె.సూర్య సినిమా ఈ సంవత్సర సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి అప్పటి నుండి ఇక త్రివిక్రం సినిమాకు ప్రారంభించమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. ఇంతకుముందు జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన వీరి కాంబినేషన్ ఈసారి కోబలిగా ఇండస్ట్రీ హిట్ ఖాయం అనేస్తున్నారు.

English summary
A photograph of Pawan Kalyan shot when he landed in Hyderabad on June 5th after completing his vacation in Singapore is now viral on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu