twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ప్రకటన...తేదీ,వెన్యూ

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'రాజకీయం ఎలా ఉండాలి? పేదలకు ఏం చేయాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా వ్యవహరించాలి?' అనే అంశాలపై తన ఆలోచనలకు అనుగుణంగా పవన్ పార్టీ రూపుదిద్దుకుంటోంది. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'రాజకీయాలపై మార్చి రెండో వారంలో మాట్లాడతాను' అని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు... మరో వారంలో ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ఈనెల 12న లేదా 15న పవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి జాతీయ మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 45 నిమిషాల నుంచి గంటపాటు మాట్లాడేందుకు వీలుగా పవన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఒక హాలు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజున హైదరాబాద్‌కు రావాల్సిందిగా పవన్ అభిమాన సంఘాల ప్రతినిధులకు సమాచారం వెళ్లింది.

    Pawan Kalyan To Announce New Political Party

    సన్నిహితులు, అభిమానులు పాల్గొనే ఈ సమావేశంలో... వేదికపై మాత్రం పవన్ ఒక్కరే ఉంటారని తెలుస్తోంది. వారందరి సమక్షంలోనే పవన్ తన రాజకీయ పార్టీపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండాలి? ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలి? పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి?.... ఇలాంటి అనేక అంశాలపై తన లక్ష్యాలు, ఆకాంక్షలను పవన్ వివరిస్తారని తెలుస్తోంది.

    అలాగే... పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇప్పటికే అక్షరబద్ధం చేసినట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఈసారికి మొత్తం అన్ని స్థానాల్లో కాకుండా... 9 లోక్‌సభ, 40 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే 'పవన్ పార్టీ' పోటీ చేస్తుందని తెలుస్తోంది.

    మొత్తానికి... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు పార్టీ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ పెడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది అచ్చంగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, బహుశా... మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.

    English summary
    Sources close to Pawan Kalyan claim that he will be announcing his decision to start a new political party and will declare that he will be contesting in the upcoming elections.Apparently the matinee idol is busy fine tuning the ideological moorings of his political outfit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X