»   »  పవన్ 'సత్యాగ్రహి' ప్రత్యేకత ?

పవన్ 'సత్యాగ్రహి' ప్రత్యేకత ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు పనుల్లో తలములకలైఉన్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి తన అన్న చిరంజీవి స్ధాపించిన ప్రజారాజ్యం లో క్రియాశీలక పాత్ర , పులి రెగ్యులర్ షూటింగ్ కి అటెండవటం, సత్యాగ్రహి స్క్రిప్టు కి మరో వెర్షన్ రాయించటం. మొదటి రెండు తెలిసినవే అయినా సత్యాగ్రహి స్క్రిప్టు హడావిడి మాత్రం ఆ క్యాంపు లోని వారందరికి ఆశ్చర్యపరుస్తోంది. అంతేగాక ఆ సినిమా కి మరో ప్రత్యేకత ఉందని వారు గుసగుసలు పోతున్నారు. అది మరేదో కాదు తమ ప్రజారాజ్యం పార్టీ భావజాలాన్ని ప్రచారం చేసే అవకాశం ఉందని .

తన కిష్టమైన చేగువేరా సిద్ధాంతాలను బలపరచటం,కామన్ ఫ్రొటక్షన్ ఫోర్స్ కి సంభందించిన వివరాలను విశదీకరించి అదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. అలాగే తన దర్శకత్వంలో రానున్న చిత్రం కావటం తో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా వాస్తవికతకు పెద్ద పీట వేయనున్నాడని తెలుస్తోంది. జనవరిలో ఈ చిత్రం ప్రారంభించేటట్లు ప్లాన్ చేస్తున్నాడని,నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావా కాదా అన్నది తేలాల్సి ఉందని అనధికార సమాచారం. అలాగే ఎలెక్షన్ టైమ్ కల్లా రిలీజ్ అయితే ఉపయోగపడుతుందని ఈ విషయం తెలిసిన శ్రేయాభిలాషులు సూచిస్తున్నారుట. ఇక ఎప్పుడెలా ప్రారంభమైనా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు మాత్రమే కాక అందరూ వేచి చూస్తారన్నది మాత్రం సత్యం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X