»   » ఆశ్చర్యం :పవన్ అడిగి మరీ ఫొటో దిగారు (ఫొటోలు)

ఆశ్చర్యం :పవన్ అడిగి మరీ ఫొటో దిగారు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో ఫొటో దిగాలని వేలమంది ఫ్యాన్స్ కలలు కంటారు. అందుకోసం ప్రయత్నిస్తారు. అయితే పవన్ కు ఎవరితో ఫొటో అడిగి మరీ దిగాలని ఉంటుంది అంటే ఇదిగో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో . ఆయనతో అడిగి మరీ ఫొటోలు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా ప్రస్తుతం గుజరాత్‌ సమీపంలోని కుచ్‌రన్ ఏరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరో నెల రోజుల పాటు అక్కడే షూటింగ్‌ను పూర్తి చేసుకోనుంది. దీంతో సినిమా కోసం చిత్ర యూనిట్ బస చేస్తున్న ఓ హోటల్‌లో పవన్ కల్యాణ్‌ను లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అనుకోకుండా కలిశారు.

Pawan Kalyan asked for photo with Kapil Dev

ఆ విషయం తెలుసుకున్న ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నారు. మీ సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ కపిల్...పవన్‌ను గ్రీట్ చేశారు.

తన లొకేషన్‌లో కపిల్‌ని చూసి ఆనందపడిన పవన్ తన ప్రస్తుత సినిమాల గురించి తెలియజేస్తూ ఇండియన్ క్రికెట్‌కు కపిల్ సేవలను పవన్ కొనియాడరట. కపిల్ దేవ్ తమ టీమ్‌ను పలకరించడం, పవన్‌తో సరదాగా ముచ్చటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సర్దార్ టీమ్ పలు ఫోటోలను చిత్ర నిర్మాత శరత్ మారర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.

English summary
Sharrath Marar, who is producing "Sardaar Gabbar Singh", was surprised when Pawan Kalyan requested to take a photo of his with Kapil Dev.
Please Wait while comments are loading...