For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, ఎన్టీఆర్ కలయిక అందుకేనా?.. హీరో, ఫ్యాన్స్‌ల ఈక్వేషన్స్ మారుతున్నాయా?

  By Rajababu
  |

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 28వ చిత్రం టాలీవుడ్‌లో అనేక ఊహాగానాలకు తెరతీసింది. బహిరంగ వేదికలపై ఎన్నడూ కలిసి కనిపించని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సినీ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా.... ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం (వీడియో)

  అయితే వీరి కలయిక వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర విశేషం అని చెప్పనక్కర్లేదు. అయితే రాజకీయంగా, సామాజిక పరంగా భిన్నాభిప్రాయాలున్న ఇద్దరు అగ్రహీరోలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం సినీ పరిశ్రమలో ఓ ఆరోగ్యకరమైన వాతావారణానికి దోహదపడుతుందనే మాట వ్యక్తమవుతున్నది.

   సినీ ప్రపంచానికి దూరంగా

  సినీ ప్రపంచానికి దూరంగా

  సినిమా అనే అంశాన్ని తప్పిస్తే.. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ సినీ ప్రపంచానికి దూరంగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. ఎదో తప్పని పరిస్థితుల్లో తప్ప ప్రైవేట్ కార్యక్రమాలకు, సినిమా ఒపెనింగులకు హాజరకావడం తక్కువగా కనిపిస్తుంది. ఒకరిని ఒకరు కలుసుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. అలాంటిది ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్‌కు పవన్ హాజరవ్వడం చర్చకు దారితీసింది.

   పవన్, ఎన్టీఆర్ మధ్య

  పవన్, ఎన్టీఆర్ మధ్య

  అయితే రాజకీయపరంగా పవన్, ఎన్టీఆర్ మధ్య కొన్ని సారూప్యాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తంగా తిరిగి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. అయితే ఇప్పడు దూరంగా ఉంటున్నారు. అలాగే పవన్ గత ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసినా.. ఇప్పుడు జనసేన పార్టీ బలపేతంపై దృష్టిపెట్టిన పవన్ కాస్తా ఆ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉన్నట్టు కనిపిస్తున్నారు.

  జనసేనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్

  జనసేనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్

  రానున్న అసెంబ్లీ ఎన్నికలకు జనసేనను పవన్ కల్యాణ్ సమాయత్తం చేస్తున్నారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, ఆయన అభిమానులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాజకీయపరంగా వారు తటస్థ స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఎన్టీఆర్‌, పవన్‌ మధ్య సంబంధాలు సానుకూలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో యంగ్ టైగర్ అభిమానులను జనసేనకు పరోక్షంగా మద్దతిచ్చే అవకాశం లేకపోలేదనే మాట కూడా బలంగా వినిపిస్తున్నది.

   జై లవకుశ పవన్ ఫ్యాన్స్ సానుకూలం

  జై లవకుశ పవన్ ఫ్యాన్స్ సానుకూలం

  అయితే జై లవకుశ చిత్రానికి పవన్ అభిమానులు సానుకూలంగా స్పందించారు అనే చర్చ మీడియాలో విపరీతంగా జరిగింది. ఇటీవల కాలంలో ఎన్టీఆర్, పవన్ అభిమానుల మధ్య సయోధ్య పెరిగినట్టు ఓ వాదన బలంగా వినిపించింది.

   జై లవకుశ నెగిటివ్ ప్రచారం

  జై లవకుశ నెగిటివ్ ప్రచారం

  జై లవకుశ చిత్రం విడుదల నేపథ్యంలో ఓ వర్గం సోషల్ మీడియాలో ఆ సినిమాకు ప్రతికూలంగా వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సినిమా గురించి సోషల్ మీడియా అకౌంట్లలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారు అనే మాట బలంగా వినిపించింది. ఆ నేపథ్యంలోనే పవన్ అభిమానులు జై లవకుశకు అనుకూలంగా ట్వీట్లు చేశారు అనే మాటకూడా వినిపించింది.

   జై లవకుశ వర్సెస్ స్పైడర్

  జై లవకుశ వర్సెస్ స్పైడర్

  ఇదిలా ఉండగా, దసరా పండుగ పురస్కరించుకొని జై లవకుశ, స్పైడర్ చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే స్పైడర్ చిత్రం గురించి ఎన్టీఆర్ అభిమానులు నెగిటివ్‌గా ప్రచారం చేశారు అనే కథనం ఓ జాతీయ మీడియాలో ప్రచురించారు. ట్వీట్లతో సహా ఆ కథనంలో పేర్కొన్నారు. స్పైడర్ చిత్రానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులు తప్పుడు ట్వీటు పెట్టారని ఆ కథనం సారాంశం. అయితే స్పైడర్ చిత్రం కూడా ప్రేక్షకుల అంచనాలను మేరకు లేకపోవడంతో ఆ వివాదానికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.

   హీరోల కలయికపై హర్షం

  హీరోల కలయికపై హర్షం

  ఇవన్నీ వాదనలు పక్కన పడితే టాలీవుడ్‌లో హీరోల, ఫ్యాన్సుల మధ్య ఇక్వేషన్స్ మారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అలా జరగడం కూడా సినీ పరిశ్రమకు మేలు అనే మాట వినిపిస్తున్నది. సామాజిక అంశాల మధ్య వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో అలాంటి వాటిని పక్కన స్వాగతించాల్సిన విషయం అనే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే గతంలో ఒక హీరో ఫ్యాన్స్, మరో హీరో ఫ్యాన్స్ బురదజల్లుకోవడం లాంటి కనిపించేవి. ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నది.

  English summary
  Janasena chief Pawan Kalyan, Young Tiger NTR are hottest topic in the news. Pawan has attended for NTR Movie opening shot, which directing by Trivikram Srinivas. These two heroes are closed together for Trivikram Movie. Now Pawan is doing film with Trivikram which slated to release for Sankaranti festival.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X