»   » పవన్ కల్యాణ్‌ను ‘లుచ్చా నాయాలా’ అంటూ ట్వీట్.. బాహుబలి2 రికార్డుకు అంటిన కులగజ్జి

పవన్ కల్యాణ్‌ను ‘లుచ్చా నాయాలా’ అంటూ ట్వీట్.. బాహుబలి2 రికార్డుకు అంటిన కులగజ్జి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పలు రకాల హీరోల ఫ్యాన్స్ ఆగడాలకు హద్దు లేకుండా పోతున్నాయి. మంచి ప్రయోజనానికి ఉపయోగించుకోవాల్సిన సోషల్ మీడియాను అనేక దుశ్చర్యలకు వాడుకొంటున్నారనే విమర్శ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి వాదనకు బలం చేకూర్చే ట్వీట్ చర్చనీయాంశమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హుందాగా బాహుబలి టీమ్‌ను అభినందిస్తే దానికి వంకలు పెడుతూ అత్యంత అభ్యంతరకరమైన రీతిలో ట్వీట్ చేయడం ఫ్యాన్స్ అజ్జానికి అద్దం పట్టింది. ఫ్యాన్స్‌కు పట్టిన కులగజ్జిపై ట్విట్టర్‌లో మాటల యుద్ధం నడుస్తున్నది.

బాహుబలి2 టీమ్‌కు పవన్ అభినందన

బాహుబలి2 టీమ్‌కు పవన్ అభినందన

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం కొనసాగుతున్నే ఉన్నది. బాలీవుడ్‌లో సూపర్ స్టార్లు అనే జబ్బలు చరుచుకునే ఖాన్ త్రయం, కపూర్ వంశ హీరోలకు సాధ్యం కాని రూ.1000 కోట్ల కలెక్షన్లను బాహుబలి2 కొల్లగొట్టింది. వందేళ్ల సినిమా చరిత్రను తెలుగు వాళ్లు తిరుగరాశారు. ఆ సందర్భానని పురస్కరించుకొని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్ ట్వీట్..

పవన్ ట్వీట్..

భారతీ సినీ పరిశ్రమలో అరుదైన రికార్డును బద్దలు చేసిన శ్రీ రాజమౌళి, శ్రీ ప్రభాస్, ఇతర బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ చాలా పద్దతిగా, హుందాగా ట్విట్టర్‌లో స్పందించారు.

పవన్‌పై అభ్యంతరకమైన వ్యాఖ్యలు

అయితే పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ‘పవన్ కల్యాణ్' అనే ఫేక్ అకౌంట్‌ ఆసరాగా చేసుకొని తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు ఒకరు. ‘పవన్ కల్యాణ్.. 1000 కోట్లు వస్తే గానీ ట్వీట్ చేయవా రా లుచ్చా నయాలా అంటూ ట్వీట్ చేయడం షాక్ గురిచేసింది. ఇతర హీరోల ఫ్యాన్స్ ఏ రేంజ్‌ ఉన్మాదంలో ఉంటారో చాటి చెప్పింది.

తీవ్రమైన మాటల దాడి..

అంతేకాకుండా మరో మెట్టు దాదటి ఇప్పుడు పావలా ఫ్యాన్స్ రేపు వచ్చి కలెక్షన్లు మా వల్లే అంటారు. మీ ముఖాలకు సినిమా హిట్ చేసుకొనే గతి లేదు పావలా నాయల్లారా అంటూ దూషించడం వివాదాస్పదమైంది. ఈ ట్వీట్లన్నీ పవన్ కల్యాణ్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ నుంచే రావడం గమనార్హం.

మీకు కులగజ్జి..

పవన్ కల్యాణ్‌ను దూషిస్తూ చేసిన ట్వీట్‌పై పవన్ అభిమానులు విరుచుకుపడ్డారు. మీకు కులగజ్టి ఎక్కువైంది. మేము నోరు తెరిస్తే దారి తీసే పరిణామాలకు బాధ్యులం మేము కాము అని పవన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. సినిమాల హిట్లు, ట్వీట్లు కులాలను ఆధారంగానే జరుగుతున్నాయని ఈ ట్వీట్ల ద్వారా స్పష్టమవుతున్నాయి.

English summary
Attack on Power star Pawan Kalyan in social media become contraversial. Pawan appreciated Baahubali team on achieving Rs. 1000 crores feat at box office. but one of the netizen seriously targeted pawan kalyan on his appreciation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu