»   » ఇప్పటికి ఖరారు చేసారు: పవన్ కళ్యాణ్ నుండి ఆమెకు కాల్!

ఇప్పటికి ఖరారు చేసారు: పవన్ కళ్యాణ్ నుండి ఆమెకు కాల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టెంపర్ మూవీ తర్వాత కాజల్ అగర్వాల్ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. చేస్తే మంచి సినిమాలు, తనకు గుర్తింపు తెచ్చే సినిమాలు మాత్రమే చేయాలనే ఉద్దేశ్యంతో మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా తిరస్కరించిందట. మొత్తానికి పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' మూవీలో ఆమెకు చాన్స్ దక్కింది.

ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఖరారైనా ఇప్పటి వరకు ఆమె షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదు చిత్ర యూనిట్. మధ్యలో ఆమె రెండు సార్లు షూటింగ్ సెట్స్ కు కూడా వచ్చి వెళ్లింది. అయినా ఆమెకు ఇంకా షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదు. ఎట్టకేలకు ఆమెకు పవన్ కళ్యాణ్ నుండి కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan calls Kajal

నవంబర్ 17 నుండి ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి షూటింగులో పాల్గొనబోతోంది. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ గుజరాత్ లోని వడొదరాలో జరుగుతోంది. తనకు షూటింగ్ నిమిత్తం పిలుపు రావడంతో ఇంతకాలం కాస్త టెన్షన్ పడ్డ ఆమె రిలాక్స్ అయిందని సమాచారం. కాజల్ ఇప్పటి వరకు మరే ఇతర పెద్ద సినిమాలకు కమిట్ కాలేదు. అయితే మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం'లో మాత్రం ఆమె ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కోస్టార్స్ షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ ఎంజాయ్ చేస్తూ శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పటిక బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ స్వయంగా తీసిన సెల్పీని తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Pawan Kalyan calls Kajal for Sardaar Gabbar Singh. According to latest reports Kajal is now a relieved person as the actress is going to join the sets with Pawan from November 17.
Please Wait while comments are loading...