»   » ‘ఛల్ మోహన్ రంగ’ ప్రీ రిలీజ్: చీఫ్ గెస్టుగా పవన్ కళ్యాణ్

‘ఛల్ మోహన్ రంగ’ ప్రీ రిలీజ్: చీఫ్ గెస్టుగా పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చల్ మోహన్ రంగ'. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ‌లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం.

Chal Mohan Ranga

ఛల్ మోహన్ రంగ ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 25న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పవన్‌కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రీ రిలీజ్‌కు అంతా రెడీ అయింది. ఈవెంట్‌కు మై ప్రొడ్యూసర్ అండ్ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు అని నితిన్ తెలిపారు.

ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నితిన్, మేఘా ఆకాష్‌తో పాటు డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి, నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య.

English summary
"All set for a Grand Pre Release event of #ChalMohanaRanga on the 25th of this month..and my Producer and our POWER STAR wil b the Chief Guest for the function!! Exciteddd!! Other details soonn!!" nithiin tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X