For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas, Jr NTRపై పవన్ కల్యాణ్ ఊహించని కామెంట్స్: సన్నాసుల్లారా అవి ఊరికే ఇవ్వలేదురా అంటూ!

  |

  పవన్ కల్యాణ్.. ఈ పేరులోనే తెలియని పవర్ ఉంది. అంతలా ఆయన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం సొంతం చేసుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అలాగే, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అలా దాదాపు ఇరవై ఏళ్లుగా తన మార్క్ చూపిస్తున్నాడు.

  ఈ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న పవన్ కల్యాణ్.. తాజాగా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్‌పై పవర్ స్టార్ ఊహించని కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  సాయి తేజ్ లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్

  సాయి తేజ్ లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్

  ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేయగా.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురవడం వల్ల దీనికి సాయి ధరమ్ తేజ్ హాజరు కాని విషయం తెలిసిందే.

  Bigg Boss: రవి నిజస్వరూపం బయటపెట్టిన షణ్ముఖ్.. ఆ అబ్బాయితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ షాకింగ్‌గా!

  మేనల్లుడి కోసం పవన్.. సుదీర్ఘంగా మాట్లాడి

  మేనల్లుడి కోసం పవన్.. సుదీర్ఘంగా మాట్లాడి

  సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. అలాగే, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. సాధారణంగా సినిమా ఫంక్షన్లలో పెద్దగా మాట్లాడని ఈ స్టార్ హీరో.. 'రిపబ్లిక్' ఈవెంట్‌లో మాత్రం దాదాపు గంట వరకూ మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఎన్నో అంశాలను లేవనెత్తాడు.

  సినిమా కష్టాలపై పవన్.. వాళ్లను టార్గెట్ చేసి

  సినిమా కష్టాలపై పవన్.. వాళ్లను టార్గెట్ చేసి

  కరోనా తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమకు విచిత్రమైన కష్టాలు వచ్చాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ చాలా రోజుల పాటు కొనసాగించడంతో పాటు టికెట్ రేట్లను సైతం ప్రభుత్వం చెప్పినట్లే నిర్ణయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సినిమాలకు మంచి స్పందన వచ్చినా రేట్లు, షోలు లేక నష్టాలనే ఎదుర్కొన్నాయి. ఈ విషయాన్ని 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ హైలైట్ చేశాడు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఇందుకోసం ఎన్నో ఉదాహరణలు చెబుతూ భారీ స్థాయిలో విమర్శించాడు.

  తన ఆల్‌టైం ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పిన మహేశ్ బాబు: 'సర్కారు వారి పాట' గురించి షాకింగ్‌గా!

  సినిమా వాళ్లపై అందుకే టార్గెట్ చేస్తుంటారు

  సినిమా వాళ్లపై అందుకే టార్గెట్ చేస్తుంటారు

  'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మీడియాపైనా విమర్శలు గుప్పించారు. 'చాలా మంది సినిమా వాళ్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్లే సాఫ్ట్‌గా ఉంటారు కాబట్టి. వీళ్లు ఏదైనా మాట్లాడినా ఏమీ అనరు. దమ్ముంటే రాజకీయ నాయకులపై మాట్లాడండి. ఇడుపులపాయలో నేల మాళిగలు ఉన్నాయి దానిపై మాట్లాడండి. మాట్లాడరు ఎందుకంటే వాళ్లు ఇంటికి వచ్చి మరీ కొడతారు కాబట్టి. తేజ్ అమాయకుడు కదా.. ఆస్పత్రిలో కళ్లు మూసుకునే ఉన్నాడు కదా. అందుకే వాడి గురించి మాట్లాడుతున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  రెమ్యూనరేషన్ల గురించి ఇచ్చిపడేసిన పవన్

  రెమ్యూనరేషన్ల గురించి ఇచ్చిపడేసిన పవన్

  సినీ పరిశ్రమలోని నటీనటులు, టెక్నీషియన్లు తీసుకునే రెమ్యూనరేషన్ల గురించి వస్తున్న వార్తలపైనా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. 'వైసీపీ నాయకులు మాట్లాడతారు.. సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తీసుకునే రెమ్యూనరేషన్ల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. అరే సన్నాసుల్లారా.. దద్దమ్మల్లారా.. ఉదాహరణకు పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటే అందులో నాలుగున్నర కోట్లు ట్యాక్సులకే పోతుంది. మిగతాది మా చేతికి వస్తుంది' అంటూ అన్ని లెక్కలేసి మరీ వివరించాడీ స్టార్ హీరో.

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్: ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోగా సాలిడ్ రికార్డు

  అందుకే మాకు అంత డబ్బులు ఇస్తున్నారు

  అందుకే మాకు అంత డబ్బులు ఇస్తున్నారు

  పవన్ కల్యాణ్ దీనిని కంటిన్యూ చేస్తూ 'డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఎవరూ దోచుకున్నది కాదు. నేను బాగా తీసుకుంటున్నాను అంటే.. అరేయ్ బాబూ నేను అడ్డగోలుగా సంపాదించలేదురా వేల కోట్లు. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదురా. జనాలను ఎంటర్‌టైన్ చేసి అంటే డ్యాన్సులు వేసో.. ఫైట్స్ చేసో.. కింద పడో.. మీద పడో.. ఎముకలు విరగ్గొట్టుకునే.. వెన్నుముకలు విరగ్గొట్టుకునో కష్టపడుతున్నాం. అందుకే డబ్బులు సంపాదిస్తున్నాం' అంటూ క్లారిటీ ఇచ్చాడు. తద్వారా పరోక్షంగా నాయకులపై సెటైర్లు వేశాడు.

  Recommended Video

  Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || FIlmibeat Telugu
  ప్రభాస్, రానా, ఎన్టీఆర్‌కు అందుకే ఇస్తున్నారు

  ప్రభాస్, రానా, ఎన్టీఆర్‌కు అందుకే ఇస్తున్నారు

  'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతూ పలువురు హీరోల పేర్లను ప్రస్తావించాడు పవన్ కల్యాణ్. 'ప్రభాస్ గారిలా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలి అవుతుంది. రానా గారిలా కండలు పెంచి చేస్తే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిలా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. రామ్ చరణ్‌లా స్వారీలు చేస్తే డబ్బులు ఇస్తారు. ఒక్కరోజులే ఇవ్వలేదు ఎవరికీ. ఒక ఆడబిడ్డ హీరోయిన్‌గా వచ్చి అందరి ముందు డ్యాన్సులు చేస్తూ ఇబ్బంది పడితే డబ్బులిస్తారు' అంటూ ఫైర్ అయ్యాడు పవర్ స్టార్.

  English summary
  Pawan Kalyan Participated in Mega Hero Sai Dharam Tej Republic Movie Pre Release Event Recently. In This Event He Commented Prabhas and Jr NTR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X