For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 వసంతాలు పూర్తి చేసుకున్న పవన్ కి అభినందనలు...!

By Sindhu
|

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో 15 వసంతాలు పూర్తి చేసుకున్నారు. 1996 లో తొలిసారిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" చిత్రంతో తెలుగు చిత్ర సీమలో అడుగిడిన ఆయన, ఆనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. తొలినాళ్ళలో 'సుస్వాగతం", 'గోకులంలో సీత" వంటి చిత్రాల్లో నవ యువకుని పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే అతన్ని ఒక స్టార్ ని చేసిన సినిమా తొలి ప్రేమ. 1998 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులను తిరగరాసింది. ఆ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక మోస్ట్ రొమాంటిక్ మూవీగా కొనియాడబడుతుంది.

అనంతరం 2001 లో విడుదలైన 'తమ్ముడు" మరియు 'బద్రి" సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక 'ఖుషీ" సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 'ఖుషీ" విజయం అతనికి తొలిసారిగా దర్శకత్వ భాద్యతలు నిర్వర్తించే (2003) 'జానీ" ధైర్యాన్ని ఇచ్చింది. పక్కా కమర్షియల్ హీరోగా మన్ననలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ 'జానీ" లాంటి సినిమా చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే 'జానీ" సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేక పోయింది. అయినా కూడా పవన్ ఏమాత్రం వర్రీ అవ్వలేదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ చాలా డైనమిక్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఐదేళ్ళ తరువాత, పవన్ కళ్యాణ్ తన 'జల్సా", 'పులి", 'తీన్ మార్" సినిమాలతో మళ్లీ బలమైన పునఃప్రవేశం చేసారు. అతని తదుపరి చిత్రం 'పంజా" డిసెంబర్ లో విడుదలకు రెడీ అవుతుంది.

ఇటీవలే 'పంజా" ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో విభిన్నంగా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్స్ ఈ చిత్రం పై అంచనాలను ఆకాశంలోకి ఎత్తివేసాయి. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే గబ్బర్ సింగ్ సినిమాలో నటించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం అతని అభిమానుల, మీడియా ఎప్పుడూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉంటుంది . గత కొన్ని సంవత్సరాలుగా అరుదుగా ప్రజల ముందుకు వస్తున్న అయన, మానవత్వాన్ని పెంపొందించే దిశలో మరింత ముందుకు సాగాలని, మరిన్ని విజమవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ 15యేళ్ళు సినీ కెరీయర్ ని సక్సెస్ ఫుల్ గా చేసిన ఈ డైనమిక్ పవర్ స్టార్ కు దట్స్ తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం...

English summary
Power star Pawan Kalyan has come a long way since he debuted in Tollywood with the film ‘Akkada Abbayi Ikkada Ammayi’. Success and failure have come in equal measure for him but it has not diminished his stature or fan following one bit.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more