»   » ఒకేరోజు రెండు విషాదవార్తలు, షూటింగ్‌స్పాట్ లోనే పవన్‌ కళ్యాణ్ విచారం

ఒకేరోజు రెండు విషాదవార్తలు, షూటింగ్‌స్పాట్ లోనే పవన్‌ కళ్యాణ్ విచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకేసారి రెండు విషాదవార్తలు ఇటు రాజకీయ రంగం అటు సినిమా ఈ రెండు రంగాలనుంచీ ఒకేసారి వచ్చిన విషాద వార్తలకి పవన్ తీవ్రంగా చలించిపోయాడు. ఇద్ద‌రు ప్ర‌ముఖులు అక‌స్మాత్తుగా త‌నువు చాలించారన్న వార్తతో రోజంతా అదే విషాదం లో ఉండిపోయాడట. గుండెపోటుతో అక‌స్మాత్తుగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తుది శ్వాస విడ‌వ‌డంపై ప‌వ‌న్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయిన పవన్ ఆయన మృతికి తన సానుభూతి తెలియజేసాడు. పీఆర్పీలో ఉన్నప్పుడు భూమా నాయకత్వ లక్షణాలు త‌న‌ను ఎంత‌గానో ఆకట్టుకున్నాయనీ. భూమా నాగిరెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని చెప్పిన ప‌వ‌న్ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం వారి కుటుంబానికి ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నానని తెలిపాడు.

ఇంకా అదే ఆలొచనల్లో ఉన్న పవన్ కి రెండో వార్త మరింత షాక్ కలిగించిందట సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించడం పై ప‌వ‌న్ త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశాడు. "విదేశాలలో కాటమరాయుడు షూటింగులో ఉన్న స‌మ‌యంలో దిల్ రాజు స‌తీమ‌ణి మ‌ర‌ణ‌వార్త విని నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను.

Pawan Kalyan condolence message on Bhuma NagiReddy death and sudden death of Dil Raju's wife

ఎందుకంటే రాజు-అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం. సినీ పరిశ్రమలో నాకున్న కొందరు ఆత్మీయుల్లో దిల్ రాజు ముఖ్యమైన వ్యక్తి. అటువంటి ఆత్మీయ వ్యక్తికి ఇంతటి కష్టం రావడం నా మనసును ఎంతో కలచివేస్తోంది. దిల్ రాజు నిర్మించే చాల చిత్రాలకు శ్రీమతి అనిత సమర్పకురాలిగా ఉండేవారు. ఆలా ఆమెకు కుడా సినీ పరిశ్రమతో సంబంధ భాంధవ్యాలు ఉన్నాయి. నాలుగున్నర పదుల వయస్సులోనే ఆమె అకాల మరణం చెందడం రాజు కుటుంబానికి తీరని లోటు. ఊహించని ఈ విపత్తును తట్టుకోడానికి రాజుకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, శ్రీమతి అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఒక ప్రకటనని పరికలకు విడుదల చేసాడు.

తాను ఉన్న రెండు రంగాలలోనూ ఇలా ఒకేసారి జరిగిన దుర్ఘటనలకి పవన్ బాగానే కలత చెందాడనీ తనకు మరీ వ్యక్తిగతంగా దగ్గరివారు కాకున్నా తమ రంగాలలో తమదంటూ ఒక ముద్ర వేసుకున్న రెండు కుటుంబాలలో నూ ఇలాంటి ఘటనలు జరగటం విచారకరం అంటూ చెప్పిన పవన్ షూటింగ్ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేక పోయినట్టు సమాచారమ్.

English summary
Actor Pawan Kalyan who is shooting for Katamarayudu in Europe is shocked to know the demise of Smt.Anitha, wife of popular producer Dilraju. He condoled the untimely death of Nandyal TDP MLA Bhuma Nagi Reddy and Dilraju Wife Anitha on thair Sudden Death
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu