twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది మాస్ కథే, పవన్ నవ్వు ఎందుకో? త్రివిక్రమ్ మామూలోడు కాదు?... పరుచూరి కామెంట్

    By Bojja Kumar
    |

    పరుచూరి పలుకులు పేరుతో సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలు పంచుకునే ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ..... పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం అందులోని పలు విషయాలను విశ్లేషించారు.

    Recommended Video

    'అజ్ఞాతవాసి' పై మహేష్ కత్తి రియాక్షన్..!
    త్రివిక్రమ్ పవర్ స్టార్‌తో పెట్టి గొప్ప క్లాసిక్ తీస్తున్నాడేమో అనుకున్నా..

    త్రివిక్రమ్ పవర్ స్టార్‌తో పెట్టి గొప్ప క్లాసిక్ తీస్తున్నాడేమో అనుకున్నా..

    టీజర్ చూసినపుడు అందులో లలితమైన సంగీతం వినిపించడంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్‌ను పెట్టి ఏదో గొప్ప క్లాసిక్ తీసేస్తున్నాడా? అనిపించింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అలాంటిదేమీ కాదని అర్థమైందని పరుచూరి తెలిపారు.

    మాస్ కథ

    మాస్ కథ

    ‘అజ్ఞాతవాసి'లో అజ్ఞాతము అంటే తెలియకుండా దాగి ఉండటం. ఈ సినిమాలో దాగి ఉన్న ఒక మాస్ కథ ఉందని ట్రైలర్ చూడగానే నాకు అర్థమైంది, అలాగే ట్రైలర్లో ఓ డైలాగ్ ఉంది. వీడి చర్యలు ఊహాతీతం అని, ఊహలకు అందకుండా ఈ పాత్ర ఉంటుందని మనకు చెప్పకనే చెప్పాడు త్రివిక్రమ్ అని పరుచూరి అభిప్రాయ పడ్డారు.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మామూలోడు కాదు, అదో అస్త్రం

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మామూలోడు కాదు, అదో అస్త్రం

    ట్రైలర్ చివర్లో ‘మళ్లీ వీడు సైకిలెక్కుతాడంటావా?' అనే డైలాగ్ పెట్టాడు. ఈ డైలాగులో చాలా అర్థం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మామూలోడు కాదు. ఆ డైలాగ్ ద్వారా అద్భుతమైన అస్త్రాన్ని వదిలాడు. మళ్లీ సైకిలెక్కడం అంటే ఏమిటి? పలానా పార్టీకి మళ్లీ సపోర్టు చేయబోతున్నాడా? అన్నట్లు ఒక ఊహకు తెర లేపారు... అని పరుచూరి అభిప్రాయ పడ్డారు.

    బాగా నచ్చిన సీన్

    బాగా నచ్చిన సీన్

    ఇందులో అన్నికంటే నచ్చింది... మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనక ఒక మినీ యుద్దమే జరుగుతుంది అని చెప్పడం. మనిషి ఒక సుఖాన్ని పొందాలి అంటే దానికోసం యుద్ధం జరుగాలి అని ఒక కుర్చీతో అద్భుతంగా చెప్పారు. ఒక చెట్టు ప్రాణం తీయడం అంటే హింస. హింసలో నుండి సుఖం వచ్చిందని చెప్పాడు. అది చెట్టు కాబట్టి నోరు లేదు కాబట్టి నరికితే ఏం మాట్లాడలేదు కాబట్టి నువ్వు ఇంత సుఖంగా దాన్ని కుర్చీగా మార్చి కూర్చున్నావు. దీనిలో చాలా జీవిత సత్యం ఉంది. సమాజానికి సంబంధించి ఎంతో విషయం ఉంది అని పరుచూరి తెలిపారు.

    పవన్ కళ్యాణ్ రెండు చరిత్రలు సృష్టించబోతున్నారు

    పవన్ కళ్యాణ్ రెండు చరిత్రలు సృష్టించబోతున్నారు

    ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ రెండు చరిత్రలు సృష్టించబోతున్నారు. విదేశాల్లో అత్యధిక థియేటర్ల రికార్డు ఆయన సొంతం చేసుకోబోతున్నారు. శివరాత్రి పండగొచ్చినపుడు మనం నిద్ర పోకుండా జాగారం చేయడం కోసం 24 గంటలు థియేటర్లలో షోలు వేస్తారు. మళ్లీ ఇపుడు 8 రోజుల పాటు రోజుకు 7 షోల చొప్పున 24 గంటలు సినిమాలు వేయడం అనేది సామాన్యమైన స్టార్స్ కోసం చేసే పని కాదు, అసామాన్యమైన ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కాబట్టే ఇది సాధ్యం అవుతోంది. ఇట్స్ నాట్ ఎ జోక్. హ్యాట్సాఫ్ టు యూ ఫర్ యువర్ ఇమేజ్.... అంటూ పరుచూరి వ్యాఖ్యానించారు.

    ఆ నవ్వు ఎందుకో?

    ఆ నవ్వు ఎందుకో?

    అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకటి అనిపిస్తుంది. మీరు మాట్లాడుతూ ఉంటారు... జనం అరుస్తూ ఉంటారు... మీరు ఆగి నవ్వుతూ ఉంటారు. అలా మీరు ఎందుకు నవ్వుతారో నాకు అర్థం కాదు. కానీ ఆ నవ్వులో గర్వం ఉండదు. చిన్న తృప్తి ఉంటుంది. నా వాళ్లు... నేను చెప్పిన దానికి స్పందిస్తున్నారు అనే తృప్తి కనపబడుతుంది.... అని పరుచూరి వ్యాఖ్యానించారు.

    ఎన్టీఆర్ చెప్పింది అదే, నువ్వు అదే ఫాలో అవుతున్నావు

    ఎన్టీఆర్ చెప్పింది అదే, నువ్వు అదే ఫాలో అవుతున్నావు

    ఎన్టీ రామారావుగారు ఒక మాట చెప్పారు నాకు. అది మీకు కూడా నేను చెబుతున్నాను. మన శత్రువు కూడా మన గురించి మాట్లాడినపుడే మనం నెం.1 అవుతాం అనేవారు. ఇది మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు నాకు తెలిసిపోతోంది. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ పర్ యువర్ అజ్ఞాతవాసి... అంటూ పరుచూరి గుడ్ లక్ చెప్పారు.

    English summary
    Pawan Kalyan to Create 2 HISTORIES. Paruchuri Gopala Krishna About Agnyaathavaasi in Paruchuri Palukulu. Agnyaathavasi / Agnathavasi Movie ft. Pawan Kalyan, Keerthy Suresh and Anu Emmanuel. Directed by Trivikram and Music Composed by Anirudh Ravichander.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X