»   » హాట్ టాపిక్: పియానో వాయిస్తున్న కూతురు, పవన్ డాన్స్!

హాట్ టాపిక్: పియానో వాయిస్తున్న కూతురు, పవన్ డాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా ఉంటుంది. తాజాగా రెండు వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చనీయాంశం అయ్యాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు సంబంధించిన వార్త. మరొకటి పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య పియానో నేర్చుకుంటున్న న్యూస్.

ముందుగా పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు సంబంధించిన వార్తలోకి వెళదాం. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పాటకు స్టెప్స్ వేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి నటించిన కొండవీటి రాజా చిత్రంలోని 'నా కోక బాగుందా' అనే సాంగులో పవన్ స్టెప్స్ వేస్తారట. సినిమాలో ఈ సాంగు రీమిక్స్ వెర్షన్ గా ఉంటుందని, ఈ పాటలో పవన్ కూడా తన వాయిస్ తో శృతి కలిపాడని అంటున్నారు. అయితే ఈ విషయమై గబ్బర్ సింగ్ టీం నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు.

 Pawan Kalyan To Dance For Chiranjeevi's Super Hit Song?


'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 20న హైదరాబాద్ లో ఆడియో వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యే అవకాశం ఉంది. సినిమాను త్వరగా పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యా గురించిన వార్తలోకి వెళితే...

పవన్ కళ్యాణ్ కూతురు ఆదర్య, కొడుకు అకీరా ప్రస్తుతం తన తల్లి రేణు దేశాయ్ వద్దనే పెరుగుతున్న సంగతి తెలిసిందే. పిల్లలను ఏ లోటూ లేకుండా వారికి అన్ని రకాల కళలు నేర్పిస్తూ పెంచుతోంది రేణు దేశాయ్. తాజాగా ఆద్యా పియానో నేర్చుకుంటున్న ఫోటోను రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది.

రేణు దేశాయ్ తన పిల్లలను భవిష్యత్తులో సినిమా రంగంలోనే సెటిలయ్యేలా వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తోంది. వారిలో సినిమా రంగానికి సంబంధించిన వివిధ అంశాల్లో అవగాహన కల్పిస్తోంది. ఆద్య సంగీతం నేర్చుకోవడాన్ని బట్టి చూస్తే పెద్దయ్యాక సంగీతం రంగంలో రాణించే అవకాశం ఉందని టాక్.

 Pawan Kalyan To Dance For Chiranjeevi's Super Hit Song?
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
Working Stills Of Sardaar Gabbar Singh
English summary
According to the grapevine, Powerstar Pawan Kalyan will shake a leg for Chiranjeevi's super hit song from Kondaveeti Raja, in Sardaar Gabbar Singh. If the sources are any true, Pawan Kalyan has also lent his voice for the remix version. However, none from the team acknowledged the reports yet. But, we would soon know the truth behind the reports, since the film will have its audio launch sometime soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu