»   » టైం ఫిక్స్ : పవన్ కళ్యాణ్ సినిమాపై దాసరి ప్రకటన

టైం ఫిక్స్ : పవన్ కళ్యాణ్ సినిమాపై దాసరి ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీనటుడు పవన్‌కళ్యాణ్‌తో అక్టోబరు నెలలో సినిమా తీస్తానని దర్శకుడు దాసరి నారాయణరావు వెల్లడించారు. ఢిల్లీలోని విలేఖరులతో దాసరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. తారకప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో 37వ చిత్రాన్ని పవన్ తో నిర్మిస్తానంటూ దాసరి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ దర్శకుడు మరెవరో కాదు... గోపాల గోపాల చిత్రం డైరక్ట్ చేసిన కిషోర్ పార్దసారధి(డాలి) అని తెలుస్తోంది.

 Pawan Kalyan-Dasari starts from October

ఈ మేరకు డాలి స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. సాయి మాధవ్ బుర్రా(గోపాల గోపాల మాటల రచయిత) ఈ స్క్రిప్టు వర్క్ లో పాల్గొని డైలాగులు రాస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ లోపు గబ్బర్ సింగ్ 2 పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్-2 చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

English summary
Legendary Director Dasari Narayana Rao is all set to make a film with Pawan Kalyan. The movie starts from October.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu