For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు.. పవన్ కల్యాణ్ కూతురు ఏడుపు.. అంబులెన్స్ సిద్ధంగా..

  By Rajababu
  |

  ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులు. రేణు బహుముఖ ప్రజాశాలి. సినీరంగంలో హీరోయిన్‌గానే కాకుండా ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ విభాగంలో మంచి పట్టు ఉంది. తాజాగా రేణు దేశాయ్ మరో పాత్రలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. రేణుదేశాయ్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  నీతోనే డ్యాన్స్‌ షోలో

  నీతోనే డ్యాన్స్‌ షోలో

  మా టెలివిజన్ నిర్వాహకులు ఒకరోజు ఫోన్ చేసి నీతోనే అనే డ్యాన్స్ షో ప్లాన్ చేస్తున్నాం. మీరు న్యాయనిర్ణేతగా వ్యవహరించాలి. ఆ కార్యక్రమం హిందీలో ప్రసారమయ్యే నాచ్‌బలియే అనే ప్రొగ్రాంగా ఉంటుంది అని చెప్పారు. అయితే నేను కొంత తటపటాయించాను. ఎందుకంటే టెలివిజన్ మాధ్యమం నాకు చాలా కొత్త. ఆ తర్వాత వాళ్ల ఒత్తిడి మేరకు అంగీకరించాను.

  హార్ట్ ఎటాక్ వస్తే

  హార్ట్ ఎటాక్ వస్తే

  నీతోనే షో ప్రొగ్రాం తొలి రోజు షూట్‌‌లో అడుగుపెట్టగానే చాలా భయం కలిగింది. ఎందుకైనా మంచిది నాకు హార్ట్ ఎటాక్ వస్తే తీసుకెళ్లడానికి అంబులెన్స్ రెడీగా పెట్టుకోండి అని అన్నాను. అందుకు వారు నవ్వి మీకు ఏమీ కాదు అని భరోసా ఇవ్వడంతో

  Pawan Kalyan Third Wife Anna Lezhneva Blessed With Baby Boy
  హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమో

  హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమో

  మొదటి రోజు సెట్‌లో అడుగుపెట్టగానే చాలా భయమేసింది. అంబులెన్స్‌ సిద్ధం చేసుకోండి... నాకు హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమో అని అన్నా. చుట్టూ ఉన్న వాళ్లందరూ నవ్వారు. ‘ఏం కాదు మేడమ్‌! మీరు ఈజీగా చేసేయొచ్చు' అని అన్నారు. కానీ నేను అంత తేలిగ్గా తీసుకోలేకపోయా. హార్ట్‌బీట్‌ నార్మల్‌ కావడానికి కొంత సమయం పట్టింది.

  సింగిల్ పేరెంట్ జీవితం కష్టం

  సింగిల్ పేరెంట్ జీవితం కష్టం

  సింగిల్ పేరెంట్ (భర్త నుంచి విడిపోయి) జీవితం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన పూర్తి బాధ్యత చూడాల్సి ఉంటుంది. సమాజంలో పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూస్తే చాలా భయంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు నా పిల్లలను స్కూల్లో వదిలిపెట్టడం లాంటివి చేస్తుంటాను.

  గుండెలో సమస్యతో అనారోగ్యం

  గుండెలో సమస్యతో అనారోగ్యం

  కొద్ది రోజుల క్రితం నా ఆరోగ్యం విషమించింది. అప్పుడప్పుడూ నాకు జ్వరం వచ్చేది. పని ఒత్తిడి వల్ల వచ్చే జ్వరం అనుకొని తేలికగా తీసుకొన్నాను. కానీ ఆరోగ్య పరిస్థితి చేజారింది. హాస్పిటల్ వెళ్తే ఆర్తోఇమ్యూన్ కండిషన్ అని డాక్టర్లు చెప్పారు. గుండెలో సమస్య ఉందని చెప్పారు. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

  బెడ్ మీద లేదంటే హాస్పిటల్‌లో

  బెడ్ మీద లేదంటే హాస్పిటల్‌లో

  అనారోగ్యంతో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఇంట్లో ఉంటే బెడ్ మీద లేదంటే హాస్పిటల్‌లో ఉండే దానిని. నా పరిస్థితి చూసి పిల్లలు చాలా భయపడ్డారు. ఆందోళన చెందారు. కానీ దేవుడు నా పిల్లల పరిస్థితి అర్థం చేసుకొని మామూలు మనిషిని చేశాడు.

  మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు

  మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు

  ఒకరోజు నా కూతురు ఆద్యా స్కూల్ నుంచి వచ్చి బెడ్‌పై ఉన్న నన్ను లేపడానికి ప్రయత్నించింది. ట్యాబెట్లు వేసుకోవడంతో గాఢ నిద్రలో మునిగిపోయాను. నేను ఎంతకు లేవకపోవడంతో ఆద్య భయపడిపోయింది. నా పక్కన కూర్చొని ఏడుస్తూ కనిపించింది. వెంటనే నీ ఒడిలోకి చేరి ‘ప్లిజ్ మమ్మీ.. నువ్వు చచ్చిపోవద్దు అని ఒకటే ఏడుపు. అలా నా కూతురు ఏడుస్తుంటే గుండె పగిలినంత పనైంది.

  ఆద్య పరిస్థితి చూసి ఏడుపు

  ఆద్య పరిస్థితి చూసి ఏడుపు

  ఆద్య పరిస్థితి చూసి నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. కానీ నేను ఏడిస్తే పాప భయపడుతుంది అని.. కంట్రోల్ చేసుకొన్నాను. పిల్లలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాను. నేను చచ్చిపోను. నీతోనే ఉంటాను అని వారికి చెప్పడంతో వారికి ధైర్యం కలిగింది. ఆ తర్వాత ‘మమ్మీని అంత త్వరగా తీసుకెళ్ళొద్దు! మమ్మీ చచ్చిపోకుండా చూసుకో అని భగవంతుడికి దణ్ణం పెట్టుకో..' అని చెప్పాను.

  ఆద్య దేవుడి ముందు

  ఆద్య దేవుడి ముందు

  అలాంటి పరిస్థితుల్లో అంతకు మించి నాకు మరేది తోచలేదు. ఆ తర్వాత ఆద్య దేవుడి ముందు ఎంతసేపు కూర్చుందో నాకు తెలియలేదు. నేనే కాస్త ఓపిక తెచ్చుకుని లేచి వెళ్లి.. ‘అసలు నేను చచ్చిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చచ్చిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?' అని చెప్పి ఆద్యలో సంతోషాన్ని నింపాను.

  అకీరా జాగ్రత్తగా చూసుకొన్నాడు

  అకీరా జాగ్రత్తగా చూసుకొన్నాడు

  నా కుమారుడు అకీరా కొంత మానసికంగా పరిణితి చెందాడు. పరిస్థితులను అర్థం చేసుకొంటాడు. అనారోగ్యం సమయంలో స్కూల్‌కి వెళ్లే ముందు నాతో కాసేపు కూర్చుని మాట్లాడేవాడు. స్కూల్‌ నుంచి వచ్చాక మాత్రలు వేసుకున్నావా అని అడిగేవాడు. హాస్పిటల్‌కి వెళ్లాల్సిన తేదీలను గుర్తుచేసేవాడు. చెల్లెలిని జాగ్రత్తగా చూసుకునేవాడు అని రేణు దేశాయ్ వెల్లడించింది.

  English summary
  Power Star Pawan Kalyan's ex wife Renu desai now single parent. She taking care of Pawan's Son Akhira Nandan, Aadhya. Few days back Renud desai fallen sick. In that situation, Aadhya cried in front of Renu and said that dont die mom.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X