twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరదలు: పవన్ కళ్యాణ్ రూ. 20 లక్షల సాయం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఉత్తరకాశీ యాత్రకు వెళ్లి ఉత్తరఖండ్ రాష్ట్రంలో ముంచెత్తిన వరదల్లో చిక్కుకు పోయిన వారి సహాయ నిమిత్తం రూ. 20 లక్షలు విరాళం అందించారు. ఇక్కడ ముంచెత్తిన వరదలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేదార్ నాథ్ పరిసర ప్రాంతంలోని కొండల్లో వేలాది మంది చిక్కుకున్నారు.

    ఇప్పటి వరకు అధికారికంగా అందిన లెక్కల ప్రకారం 556 మృతదేహాలను వెలికి తీసారు. వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 60వేల మందికి పైగా కొండప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరో 15 రోజులు పడుతుందని అధికారిక వర్గాల సమాచారం.

    ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన తెలుగువాళ్లలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేస్తోంది.

    English summary
    Pawan Kalyan once again proved that he is the man of humanity by donating 20 lakhs to flood victims north Kasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X