»   » మనటీవీ లో పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇదీ.... కుర్చీలు విసిరేసి వీరంగం

మనటీవీ లో పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇదీ.... కుర్చీలు విసిరేసి వీరంగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా ఓ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న పవన్ ఫ్యాన్స్ స్టూడియో లైవ్ లోనే రచ్చ రచ్చ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా కాటమరాయుడుపై భిన్నమైన టాక్ వచ్చింది . సోషల్ మీడియాలోఅయితే రకరకాల రైటప్స్ వచ్చాయి . అలాగే ఈ సినిమాపై వెబ్సైట్స్ లో, పత్రికల్లో సమీక్షలు కూడా భిన్నంగానే వచ్చాయి .

Pawan Kalyan Fans Fighting With Anchor In TV studio

అయితే మన టీవీ అనే ఒక చానెల్ అభిమానులను పిలిచి సినిమా పై చర్చ జరిపింది. అంతా అయ్యాక యాంకర్ కాటమరాయుడు కు రేటింగ్ 3 ఇస్తున్నట్టు చెప్పాడు. అంతే అప్పటివరకూ కూల్ గా ఉన్న ఫ్యాన్స్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా హీరో సినిమాకి అంత తక్కువ రేటింగ్ ఇస్తావా అంటూ భగ్గుమన్నారు. యాంకర్ పై విరుచుకుపడ్డారు. కుర్చీలు.. విసిరివేసి హంగామా సృష్టించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి.

నిజానికి కాటమరాయుడు పై డివైడ్ టాక్ నడుస్తోంది అక్కడ ఉన్నది పవన్ కాకపోయి ఉంటే కనీస కలెక్షన్లు కూడా రావన్నది అందరు సమీక్షకుల మాట. సాధారణంగా 3 పాయింట్ రేటింగ్ అంటే అంత తక్కువేమీ కాదు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఇంకా గొప్పగా ఊహించుకుని అంత తక్కువ ఇస్తారా అంటూ అక్కడ ఉన్న సిబ్బంది పై దాడికి దిగారు. అయినా సినిమాలో దమ్ముంటే ఏ రివ్యూలూ, రేటింగ్ లూ ఏం చేయలేవన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడూ కాంట్రవర్సీలకీ, గొడవలకీ దిగేది ఫ్యాన్స్ లో ఉండే అత్యుత్సాహమే...

English summary
Pawan Kalyan fans took fanswar and Fabian next level by beating tv anchor in a live show. For giving low ratings go katamarayudu. This is crazy and stupid but they did this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu