»   »  పవన్ కళ్యాణ్...ప్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

పవన్ కళ్యాణ్...ప్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ మంచి ఫామ్ లో ఉన్నారని రీసెంట్ గా రిలీజైన అత్తారింటికి దారేది కలెక్షన్స్ చెప్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రద్దలు కొడుతూ ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో మరో వార్త పవన్ స్టామినాని ప్రపంచానికి తెలియచేసింది. న్యూయార్క్ టైమ్స్ ఆన్ లైన్ సర్వే లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉండటం జరిగింది. ఇది పవన్ ఫ్యాన్స్ కు పండుగ లా మారింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వైరల్ గా ముందుకు వెళ్తోంది. ఈ సర్వే వివరాలను వారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సర్వేలోనూ పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంగా పాల్గొని ఓటింగ్ చేయటం జరిగింది. ఇలాంటి ఫలితాలు తమకు బూస్ట్ ఇస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక ఆ ఫలితాలు మరో సారి పరికిస్తే...రీసెంట్ గా న్యూయార్క్ టైమ్స్ కండెక్ట్ చేసిన ఆన్ లైన్ సర్వేలో ఇండియాలోని 10 మోస్ట్ డిజైరబుల్ ఏక్టర్స్ లో నెంబర్ వన్ ఐదవ స్దానంలో వచ్చారు. ఆ తర్వాత ఆరవ స్దానం మహేష్ ది.. సౌత్ నుంచి పవన్ కళ్యాణ్ దే మొదటి స్ధానం అని చెప్పాలి. మొదటి ప్లేస్ లో షారూఖ్ ఖాన్ ఉన్నారు. సల్మాన్ ఖాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అక్షయ్ కుమార్ ధర్డ్ ప్లేస్ లోనూ, హృతిక్ రోషన్ నాలుగవ స్దానంలోనూ ఉన్నారు. తమిళ నటుడు విజయ్ ఏడవ ప్లేస్ లోనూ, రణబీర్ కపూర్ తొమ్మిదవ స్ధానంలోనూ, అజయ్ దేవగన్ పదవ ప్లేస్ లోనూ ఉండటం జరిగింది.

అలాగే తెలుగు సినిమా కోట్లకు పడగెత్తుతోంది. ఇదివరకు వంద కోట్ల మాట ఒక్క బాలీవుడ్‌కే పరిమితం. ఇప్పుడు తెలుగు సినిమా కూడా ఆ మాట అనగలిగే ధైర్యం చేస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు టాలీవుడ్‌ మార్కెట్‌ పెరుగుతోంది. షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌ల సరసన మన కథానాయకులకూ చోటు దక్కుతుందనే నమ్మకం కలుగుతోందిప్పుడు. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. 'అరుంధతి' వసూళ్ల పరంపరకు బీజం వేస్తే... 'మగధీర'కు అది మొక్కై మొలిచింది. ఇప్పుడు అత్తారింట్లో కోట్ల పూలు కురిపిస్తోంది. 'అదిగో వంద కోట్ల తీరం..' అంటూ ఆశలు చిగురింపజేస్తోంది.

'అత్తారింటికి దారేది' రూ.వంద కోట్ల ఆశలు రేకేతిస్తోంది. 'త్వరలోనే మా సినిమా ఆ మైలురాయి అందుకొంటోంది' అని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. రాజమౌళిలాంటివాళ్లు కూడా ఈ సినిమాని అప్పుడే వంద కోట్ల క్లబ్‌లో చేర్చేశారు. పవన్‌ చిత్రం ఆ లక్ష్యాన్ని అందుకొన్నా, లేకున్నా భవిష్యత్తులో ఈ అంకెను అందుకోవడం అంత కష్టం కాదనే విశ్వాసాన్ని మిగతా నిర్మాతలకు కలిగించిందీ చిత్రం. ''తెలుగు సినిమా మార్కెట్‌కి ఇది మంచి పరిణామం. ఈ పరంపర వంద కోట్ల దగ్గరే ఆగిపోకూడదు. ఎందుకంటే మనం ఎవ్వరికీ తీసిపోం'' అని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు చెబుతున్నారు.

English summary
Recently the New York Times conducted an online survey on the top 10 most desirable actors in India and Pawan has got the 5th place in that. The sixth place has been given to Mahesh Babu. In south, Pawan stands as the number 1 actor. Meanwhile, the first place in the list has gone to Shah Rukh Khan while Salman Khan got the second place. Akshay Kumar has taken the third spot with Hrithik Roshan filling the fourth. Tamil actor Vijay stands at seventh, Ranbir Kapoor on ninth and Ajay Devgn on tenth. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu