»   » పవన్ అభిమానులని రెచ్చగొట్టాడు... బాబీ మరీ అలా అని ఉండాల్సింది కాదేమో

పవన్ అభిమానులని రెచ్చగొట్టాడు... బాబీ మరీ అలా అని ఉండాల్సింది కాదేమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సార్లు అసనం అన్నది సినీ ఇండస్ట్రీ లో పెద్ద అపార్థాలకే దారి తీస్తుంది. అనుకోకుండా వచ్చిన ఆవేషం లో ఏదో ఒక మాట అనేసి తీరిగ్గా తల పట్టుకునే సంఘటనలు మన టాలీవుడ్ లో మామూలే. కొన్ని సార్లు ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా అత్యుత్సాహం తో వచ్చే వ్యాఖ్యలు మరో రకంగా జనం లోకి వెళ్తాయి. ఇప్పుడు అదే జరిగిందా లేక కావాలనే అన్నాడో గానీ దర్శకుడు బాబీ అన్న మాటలు టాలీవుడ్ లో కొత్త చర్చకే దారి తీసాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి చికాకు కలిగించాయి... ఇంతకీ బాబీ అంత మాట ఏమన్నాడూ అంటే...

పవన్ ని టార్గెట్ చేసినట్టు

పవన్ ని టార్గెట్ చేసినట్టు

ఎన్టీఆర్ బర్థ్ డే వేడుకలకు వచ్చిన బాబీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ని పొగుడుతూ ఆయన చెప్పిన మాటల లో భాగంగా చేసిన కొన్ని మాటలో పవన్ ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం తో ఉన్నారు. ఈ సమావేశంలో బాబీ చేసిన ప్రసంగం ఆద్యంతం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ సాగింది.

తారక్ జన్మించడం అదృష్టం

తారక్ జన్మించడం అదృష్టం

తెలుగు నాట తారక్ జన్మించడం అదృష్టమని అంటూ గత 47 రోజులుగా రెండవ టేక్ అడుగుదామంటే అవకాశం ఇవ్వకుండా జూనియర్ ‘జై లవ కుశ' లో నటిస్తున్నాడు అంటూ జూనియర్ పై ప్రశంసలు కురిపించాడు బాబీ. అయితే ఇదే సందర్భంలో ఈ దర్శకుడు మాట్లడుతూ అన్న మాటలే ఇప్పుడు చర్చల కు దారి తీసాయి.

జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్

జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్

"సెట్స్ కు నవ్వుకుంటూ రావడం తన పని మాత్రమే తను చూసుకోవడం తప్ప ఇతరుల పనుల్లో వేలు పెట్టడం గానీ చూడడం గానీ జూనియర్ కు ఏమీ ఉండవు" అని బాబి చెప్పగానే అక్కడున్న అభిమానులంతా ‘జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్' అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కి అభిమానులకు ఆనందం కలిగించిన ఇదే అంశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రం చికాకు కనిపించేలా ఉన్నాయి.

పవన్ పై విమర్శ ఉంది

పవన్ పై విమర్శ ఉంది

దీనికి కారణం బాబీ గత చిత్రం పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్' అన్న విషయం తెలిసిందే. గతం లోనూ డైరెక్షన్ విషయం లో ఎక్కువ జోక్యం చేసుకుంటాడనీ, దర్శకుడిని పని చేయనివ్వకుండా మొత్తం తానే చేసుకుంటాడనీ విమర్శ ఉంది. ఒక వేళ సినిమా గనక ఫ్లాప్ అయితే ఆ బ్యాడ్ నేమ్ మొత్తం దర్శకుడు మోయాల్సిందే.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో బాబీకి స్వేఛ్చ లభించలేదని అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నారని అందుకే సినిమా ఆ స్థాయిలో వచ్చిందన్న ప్రచారం జరిగిన నేపధ్యంలో ప్రస్తుతం బాబీ చేసిన కామెంట్స్ ఆ విషయాలను తిరిగి గుర్తు చేసేవిగా ఉన్నాయి అన్నది పవన్ అభిమానుల అభిప్రాయం.

అభిమానులకు జోష్ ఇవ్వడానికి

అభిమానులకు జోష్ ఇవ్వడానికి

అయితే దీని వెనకాల కావాలని చేసిన పనేమీలేదనీ తాను పని చేసే హీరో గురించి దర్శకుడు పొగడటం అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఎన్టీఆర్ అభిమానులకు జోష్ ఇవ్వడానికి అన్న కామెంట్స్ వెనుక లేనిపోని అర్ధాలు పవన్ అభిమానులు అనవసరంగా వెతుకుతున్నారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు .ఏమైనా బాబి అనుకోకుండా చేసిన కామెంట్స్ తో పవన్ అభిమానుల మధ్య ఇరుకున పడ్డాడు అని అనుకోవాలి..

English summary
Tollywood Director Bobby comments while Birth Day Party of junior NTR hurted power star Pawan Kalyan fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu