»   » పవన్ స్వీట్ వార్నింగ్: అన్నయ్యనే విభేదించిన వాడ్ని.. మీరు నాకో లెక్కా!

పవన్ స్వీట్ వార్నింగ్: అన్నయ్యనే విభేదించిన వాడ్ని.. మీరు నాకో లెక్కా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్ లో మిత్ర పక్ష పార్టీలు బీజేపీ, టీడీపీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలిసి ప్రజలకు సేవలందించాలన్న ఎజెండా అమలు చేయనప్పుడు మీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.

Pawan Kalyan given sweet warning to TDP, BJP

శుక్రవారం జనసేన కార్యాలయంలో మీడియాతో పవన్ మాట్లాడుతూ 'ప్రజల పక్షాన నిలువడానికి సొంత అన్నయ్య చిరంజీవిని, కుటుంబాన్ని విభేదించి వచ్చిన వాడ్ని. కేవలం పరిచయంతోనో, స్నేహంతోనో కలిసి ప్రయాణం చేయాల్సిన వచ్చిన మీతో విభేదించి విడిపోవడం నాకు లెక్క కాదు. దాని గురించి మరోమారు ఆలోచించే ప్రసక్తి కూడా ఉండదు. మీకు నాకు మధ్య ఉన్నది ఓ కామన్ ఎజెండా. అది కలిసి ప్రజలకు సేవ చేయడం. అది జరుగనప్పుడు ఎందుకు మీతో కలిసి ఉండాలి. ఈ పరిస్థితుల్లో మీతో ఎందుకు కలిసి ఉండాలో నాకు చెప్పాలి..లేదా ప్రజలకు కచ్చితంగా చెప్పాల్సి ఉంది'అని పవన్ కల్యాణ్ అన్నారు.

English summary
Jana Sena Chief Pawan Kalyan said that common Agenda of Public welfare is not not implemented. so why should I go with you, and your alliance. Ap government should reveal to public and me too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X