»   » కాటమరాయుడికి బ్రేక్.. అమెరికాకు పవన్ కల్యాణ్

కాటమరాయుడికి బ్రేక్.. అమెరికాకు పవన్ కల్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటించేందుకు వెళ్లినట్టు సమాచారం.


బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పవన్ పాల్గొంటాడు. పవన్‌తో పాటు మరో స్టార్ మాధవన్ కూడా ఈ సదస్సుకు హజరుకానున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించనున్నారు.


ఈ నెల 11, 12 తేదీలలో..

ఈ నెల 11, 12 తేదీలలో..

హర్వర్డ్ యూనివర్సిటీలో 14వ ఇండియా కాన్ఫరెన్స్ 2017 ఫిబ్రవరి 11, 12 తేదీలలో జరుగనున్నది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పాల్గొననున్నట్టు ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ట్విట్టర్‌లో ఇదివరకే ప్రకటించారు. ఈ సదస్సుకు ఆహ్వానం అందడంపై పవన్ కల్యాణ్, మాధవన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


యువతకు స్ఫూర్తినిచ్చేలా పవన్ కల్యాణ్ స్పీచ్

యువతకు స్ఫూర్తినిచ్చేలా పవన్ కల్యాణ్ స్పీచ్

ఇండియా కాన్ఫరెన్స్ సదస్సులో యువతలో స్ఫూర్తిని నింపే విధంగా పవన్ ప్రసంగం ఉంటుందనే అభిప్రాయాన్ని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఏపీలో జనసేనను బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న క్రమంలో ఈ సదస్సులో పాల్గొనే అవకాశం పవన్ రావడం సానుకూల అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ప్రపంచ వేదిక ద్వారా పవన్ చేసే ప్రసంగం జనసేన బలోపేతానికి సహకారం అందించే అవకాశముంది.


ప్రపంచ వేదికపై జన సేనాని ప్రసంగం

ప్రపంచ వేదికపై జన సేనాని ప్రసంగం

హార్వర్డ్ వర్సిటీ సదస్సు తర్వాత ఉత్తర అమెరికాలోని భారత సంతతికి చెందిన వారిని పవన్ కలువనున్నారు. న్యూ హాంఫ్‌షైర్ లోని నాషువా పబ్లిక్ హైస్కూల్ సౌత్ లో జరుగనున్న సభకు వెళ్లేందుకు పలు వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ అనంతరం ప్రవాసాంధ్రులతో కలిసి డిన్నర్ కూడా చేయనున్నట్టు సమాచారం.


కాటమరాయుడికి కొద్దిరోజులు బ్రేక్

కాటమరాయుడికి కొద్దిరోజులు బ్రేక్

అమెరికా పర్యటన నేపథ్యంలో నిర్విరామంగా జరుగుతున్న కాటమరాయుడు షూటింగ్ కొన్ని రోజులు దూరం కానున్నారు. అయితే పవన్ లేకుండానే షూటింగ్ ను కొనసాగించేందుకు నిర్మాత ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 29న విడులయ్యేందుకు సిద్ధమవుతున్నది.


English summary
Power star Pawan Kalyan is attending the India conference 2017 in America. This conference is conducting at Bostan's Harvard University. After this event Pawan is going to meet several NRI groups.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu