Just In
- 18 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 34 min ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
- 1 hr ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 2 hrs ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
అస్సాంలో గడ్డకట్టి , పాడైపోయిన వెయ్యి కోవిషీల్డ్ వ్యాక్సిన్ షాట్లు .. విచారణకు ఆదేశం
- Finance
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ ఫ్యాన్స్‌కు పండుగే: మూడో సినిమానూ ఓకే చేసిన పవర్ స్టార్.. హిట్ కాంబో రిపీట్.!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సంచలనం. సినిమాలు, రాజకీయాలు, సేవా కార్యక్రమాలు ఇలా ప్రతి విషయంలో ఆయన హైలైట్ అవుతూనే ఉన్నారు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా బ్లాక్ బస్టర్ మూవీలతో స్టార్ హీరో అయిపోయాడు. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిపోయిన పవన్ మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. తాజాగా ఆయన రీఎంట్రీ మూవీల గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

బడా డైరెక్టర్ వల్ల పవన్ రీఎంట్రీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉండడం వల్ల పవన్ కల్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఇకపై సినిమాల్లో నటించనని, ప్రజా సేవకే తన జీవితం అంకితం ఇస్తానని చాలా సందర్భాల్లో వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌ను మరోసారి నటింపజేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఫలితంగా ఆయన పింక్ సినిమా రీమేక్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు.

సూపర్ హిట్ సినిమాకు రీమేక్
బాలీవుడ్‌లో బంపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘పింక్'. వేశ్య గృహాల్లో మగ్గుతున్న ముగ్గురు యువతులను కాపాడేందుకు ఓ లాయర్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇందులో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ చేయనున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నారు.

రీఎంట్రీని ఘనంగా చాటుకుంటున్న పీకే
చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండడంతో కొద్ది రోజులుగా ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చినా హైలైట్ అవుతోంది. దీంతో నిత్యం పవన్ రీఎంట్రీ వార్తల్లోకి వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం పీకే రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

క్రియేటివ్ డైరెక్టర్‌తో మూవీ మొదలు
‘పింక్' రీమేక్ షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే పవన్ కల్యాణ్ మరో సినిమాకు కూడా పట్టాలెక్కించేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమైపోయాయి. పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీలో పవన్ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నాడని సమాచారం.
|
మూడో సినిమానూ ఓకే చేసిన పవర్ స్టార్
ఇప్పటికే రెండు సినిమాలను పట్టాలెక్కించేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వీటితో పాటే ఆయన మరో సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న ఈ మూవీని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా మైత్రీ మూవీస్ బ్యానర్ వెల్లడించడంతో అధికారికంగా కూడా ఈ వార్త కన్ఫర్మ్ అయింది. హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమాను నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది.

హిట్ కాంబో రిపీట్.. పవన్ ఫ్యాన్స్‌కు పండుగే
గతంలో హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్' అనే సినిమా వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. అప్పటి వరకు ఫ్లాప్‌లతో బాధ పడుతున్న పవన్‌ను ఈ మూవీ హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇందులో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.