twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిమాచల్ ట్రాజెడీ: పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారంటూ ప్రచారం, ఆర్థిక సహాయం?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది వద్ద జరిగిన ప్రమాదంలో 25 మంది తెలుగు విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకు పోయి మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. రెండు రాష్టాల ప్రభుత్వాలు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. కనీసం మృతదేహాలైనా కుటుంబాలకు అప్పగించాలనే ఉద్దేశ్యంతో గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగిస్తున్నారు.

    ఈ ఘటనకు సంబంధించిన వార్తల్లో తాజాగా పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ ఘటన చాలా డిస్టర్బ్ చేసిందని, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన విషయాలను స్వయంగా తెలుసుకోవడానికే పవన్ హిమాచల్ ప్రదేశ్ కి బయలుదేరి వెళ్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాన్ స్వయంగా మృతుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం ఇంకా ఎక్కడా అపీషియల్‌గా వెల్లడి కాలేదు. కావాలనే పవన్ ఇందుకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతున్నారని టాక్.

    Pawan Kalyan Heads To Himachal Pradesh To Help Hyderabad Students

    పవన్ కళ్యాణ్ సినిమా విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన 'గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ పార్ధసాని' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. వ్యాపారి పాత్రలో నటించే వెంకటేష్‌కు జోడీగా 'శ్రియ' నటిస్తున్నారు. పాపులర్ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు డి.సురేష్ బాబు.శరత్ మరార్ లు తెలిపారు.

    English summary
    Power Star Pawan Kalyan, who is known as most generous Telugu actor, has headed to Himachal Pradesh, where he will meet the engineering students from Hyderabad, who suffered an accident caused by sudden flash flood in Beas river in Mandi on Sunday (June 8). The tragic incident occurred after water was suddenly released into the river from Laarji Hydropower Project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X