twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాడులు చేస్తే ఎదురుదాడి చేయను.. ఆ వ్యక్తికి.. పవన్ కౌంటర్.. జనసేనాని లెజెండ్.. రానా

    By Rajababu
    |

    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలంగాణలో చేపట్టిన మూడో రోజు యాత్రలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్‌పై ఓ దుండగుడు ఇలా చేయడం సంచలనంగా మారింది. ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్నారు పవన్. అయితే అదేమిటంటే..

    తల్లాడ వద్ద చెప్పుతో దాడి

    తల్లాడ వద్ద చెప్పుతో దాడి

    బుధవారం పవన్ కల్యాణ్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఆ జన సమూహంలో పవన్‌పైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. "అయితే అదృష్టవశాత్తూ అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

    ఖమ్మంలో కార్యకర్తలతో పవన్

    ఖమ్మంలో కార్యకర్తలతో పవన్

    ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ మాట్లాడుతూ.. నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేయాలి అని అన్నారు.

    ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయను

    ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయను

    జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. నాకు కులం, మతం లేదు. మానవత్వం, జాతీయతను గౌరవిస్తా. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉంది. కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేము. మెత్తగా మాట్లాడతానని కొందరు అనుకోవచ్చు. వ్యూహంలో భాగంగానే కొద్దిగా తగ్గుతాను అని పవన్ తెలిపారు.

    సామాజిక న్యాయం జరుగదు

    సామాజిక న్యాయం జరుగదు

    ఎన్నికల్లో సీట్లు ఇస్తేనే సామాజిక న్యాయం జరగదు. తమ కులం అభివృద్ధి చెందకపోవడంపై నేతలు ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదు. కార్యకర్తలు సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు తెలుసుకోవాలి అని పవన్ పేర్కొన్నారు.

    నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కదిలించింది

    నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కదిలించింది

    నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య నన్ను కదిలించింది. ప్రజలకు అండగా నిలబడితే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. ఇంతకాలం ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

    సమస్యలపై దృష్టిపెట్టాలి

    సమస్యలపై దృష్టిపెట్టాలి

    జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలను వెలుగులోకి తేవాలి. సమస్యలపై అధికారపక్షాలను నిలదీయడమంటే తిట్టడం కాదు.. నా జీవితం జనసేన కార్యకర్తలకు అంకితం. నేను పదవులు కాదు..సామాజిక మార్పు కోరుకుంటున్నా. ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను అని పవన్ అన్నారు.

    పవన్ లెజెండ్.. రానా మద్దతు

    పవన్ లెజెండ్.. రానా మద్దతు

    ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్‌పై రానా ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా వాళ్లు ఏ రంగంలో అయినా రాణిస్తారు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరు కూడా సినిమా పరిశ్రమలో లెజెండ్స్. తమకు నచ్చిన మార్గాలను వారు ఎంచుకున్నారు. వారు ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తులు అని రానా అన్నారు.

    English summary
    After Agnyathavaasi movie, Pawan Kalyan has started Telangana tour on behalf of Jana Sena Party. In this tour one of the person.. threw the chappal on Pawan Kalyan. In this context Pawan said I don't do revenge attacks. Apart from this Rana supports pawan Kalyans stint in politcs. He considered as Rajanikanth and Pawan Kalyan as legend in both sectors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X