»   » ప‌వ‌ర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ప్ర‌శ్నిద్దాం

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ప్ర‌శ్నిద్దాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

స‌మాజంలో నెల‌కొన్న స‌మస్య‌లను ఎత్తిచూపుతూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సినీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. 'ప్ర‌శ్నిద్దాం' పేరుతో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు ద‌ర్శ‌కుడు బ‌ద్రీనాయుడు అబ్బు తెలిపారు. తామే ఓ చిత్ర‌ యూనిట్‌గా ఏర్పడి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి స్ఫూర్తితో ఈ సినిమా చేస్తున్న‌ట్టు ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు తెలిపారు. కేవ‌లం మూడు పాత్ర‌ల‌తోనే, అతి త‌క్కువ రోజుల్లోనే ఈ సినిమాను తెర‌కెక్కిస్తూ వినూత్న‌మైన ప్ర‌యోగానికి తెర‌లేపుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.

Pawan Kalyan inspires Prashinaddam

స‌మాజ స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపుతూ 'ప్రశ్నిద్దాం'.. ఇది మ‌న హ‌క్కు అంటూ ఈ సినిమా క‌థ‌నం సాగుతుంద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. చంద్ర‌బోస్ సేవా స‌మితి స‌మ‌ర్ప‌ణలో శ్రీ‌ వెంక‌టేశ సాయి ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాస‌రి న‌ర‌సింహ, యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. న‌టీన‌టుల వివ‌రాలు ప్ర‌క‌టించి త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా వినూత్న రీతిలో జ‌రుప‌బోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ తెలిపింది.

English summary
Power Star Pawan Kalyan fans are in attemp of making a movie Prashniddam. This movie being made of Pawan Kalyan's inspiration. This movies director is Badri Nayudu. Only Three roles are in this movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu