»   » తిట్లు తినడం ఇష్టం, భరిద్దాం: అజ్ఞాతవాసి ప్లాప్, మహేష్ కత్తి ఇష్యూపై పవన్ కళ్యాణ్!

తిట్లు తినడం ఇష్టం, భరిద్దాం: అజ్ఞాతవాసి ప్లాప్, మహేష్ కత్తి ఇష్యూపై పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
మహేష్ కత్తి ఇష్యూపై పవన్ కళ్యాణ్ !

ఇకపై సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు పవన్ కళ్యాణ్ తన తాజా రాజకీయ పర్యటనలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సమాజంలో పెద్ద స్థాయిలో మార్పు తేవాలంటే పొలిటికల్ ప్రాసెస్ లోనే ఉండాలి. నేను అది నమ్మాను కాబట్టే ఇటు వైపు వచ్చాను... అని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ సమన్వయ కర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం

సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం

కొంత మందికి ఎక్కువ ధనం సంపాదించాలని ఉంటుంది. కీర్తి సంపాదించాలని ఉంటుంది. అధికారం సంపాదించాలని ఉంటుంది. నాకు ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరుకుంటాను. అదే జనసేన పార్టీ సిద్ధాంతం.... అని పవర్ స్టార్ తెలిపారు.

సౌతిండియాలో హయ్యెస్ట్ టాక్స్ కడుతున్న వారిలో నేను

సౌతిండియాలో హయ్యెస్ట్ టాక్స్ కడుతున్న వారిలో నేను

నేను చాలా బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాను. సౌతిండియాలో హయ్యెస్ట్ టాక్స్ కడుతున్న వారిలో నేనూ ఒకడిని. నేను సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉండిపోవచ్చు..... కానీ నాకు అలా ఉండటం ఇష్టం లేదు అని అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సినిమా ఫెయిలై తిట్లు తినడం కంటే కూడా పొలిటికల్ గా ఫెయిలై తిట్లు తినడం ఇష్టం.

సినిమా ఫెయిలై తిట్లు తినడం కంటే కూడా పొలిటికల్ గా ఫెయిలై తిట్లు తినడం ఇష్టం.

పవర్ స్టార్ నటించిన ‘అజ్ఞాతవాసి' ఇటీవల విడుదలై ప్లాపైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పవర్ స్టార్ పరోక్షంగా స్పందించారు. నాకు సినిమా ఫెయిలై తిట్లు తినడం కంటే కూడా పొలిటికల్ గా ఫెయిలై తిట్లు తినడం ఇష్టం.... అని చెప్పుకొచ్చారు.

ఆగిపోవడం ఇష్టం లేదు

ఆగిపోవడం ఇష్టం లేదు

మన చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి. మన దృష్టికి వచ్చినపుడు స్థాయి లేదు, బలం లేదు అని ఆగిపోతాం. నాకు అలా ఆగడం ఇష్టం లేదు. పాలిటిక్స్ లో కష్టాలు ఉంటాయి. వాటిని భరించడానికే వచ్చాను పవన్ కళ్యాణ్ తెలిపారు.

నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది అనిపించవచ్చు

నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది అనిపించవచ్చు

కొందరు నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది అనిపించవచ్చు. నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం. భరిద్దాం. భరించిన వాడే సాధించగలడు. ఒక మాట అన్నాడు కదా అని పారిపోతే ఎట్లా? అలా చేస్తే నిన్ను తిట్టే వారు విజయం సాధించినట్లు. అలా దేని నుండి పారిపోవద్దు. అలా అని ఎదురు దాడి చేయవద్దు. భరించండి. అలా చూడండి. ఎంత సేపు అంటారో చూడండి. మార్పు చాలా సైలెంటుగా వచ్చేస్తుంది. భరించడం చాలా బలమైన శక్తి.... అని పవర్ స్టార్ అన్నారు.

ఈ కామెంట్ కత్తిని ఉద్దేశించేనా?

ఈ కామెంట్ కత్తిని ఉద్దేశించేనా?

ఈ మధ్య కాలంలో మీరు చూశారు. ఎవరికీ జరుగనంతగా ఎన్నో సమస్యలు ఉండగా నన్ను టార్గెట్ చేసిన విధానం నాకు అర్థమైంది. నన్ను రాజకీయాల్లోకి రానివ్వ కూడదు. నా ఆలోచన ముందుకు వెళ్ల నివ్వ కూడదు. నేను ఇక్కడే ఆగిపోవాలని అని చూశారు. వారు అన్నవన్నీ తీసుకుంటాను.... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

సున్నితంగా కనిపిస్తానేమో కానీ చాలా మొండి తనం ఉంది

సున్నితంగా కనిపిస్తానేమో కానీ చాలా మొండి తనం ఉంది

నన్ను ఎంత హింసించినా నాలోనూ మొండితనం ఉంటుంది. చూడ్డానికి సున్నితంగా కనిపిస్తానేమో కానీ చాలా మొండి తనం ఉంది. నా ఆశయాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమైపోతాను. అలాంటి బలమైన విశ్వాసాలు నాకు ఉన్నాయి.... అని పవర్ స్టార్ తెలిపారు.

సినిమాల కంటే కూడా రాజకీయాలు నాకు ప్రాణం

సినిమాల కంటే కూడా రాజకీయాలు నాకు ప్రాణం

మీరు నన్ను ఇంతకాలం కేవలం ఒక నటుడిగా చూసి ఉండవచ్చు. సినిమా ఫీల్డులో ఇపుడు నాకు గ్రోత్ ఉంది. దాన్ని వదులుకుని వచ్చాను. సినిమాలో రెండున్నర గంటలు చేస్తాం. రెండున్నర గంటల్లో మంచి సామాజిక సందేశంతో కూడిన సినిమా చేయవచ్చు. చాలా బావుంటుంది. చప్పట్లు పడతాయి. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏడుస్తారు. రెండున్నర గంటల తర్వాత బయటకు వచ్చి రోడ్డు మీద ఆ సీన్ బావుంది ఈ సీన్ బావుంది అని మాట్లాడుకుని వెళ్లిపోతారు. దాని వల్ల సమాజానికి కొద్ది రోజులు ఆలోచన ఉండిపోతుందేమో కానీ, నిజంగా సమాజానికి ప్రాక్టికల్ గా మార్పు చాలా తక్కువ తీసుకొస్తుంది. అదే పొలిటికల్ గా ఉంటే ఎక్కువ మార్పు తేవచ్చు. నిజ జీవితంలో దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే సినిమాల కంటే కూడా రాజకీయాలు నాకు ప్రాణం..... అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

English summary
JanaSena Party Chief Pawan Kalyan interaction with JanaSainiks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu