»   » ‘పవన్ కళ్యాణ్ కనబడుట లేదు’ అంటూ హల్ చల్

‘పవన్ కళ్యాణ్ కనబడుట లేదు’ అంటూ హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సోషల్ నెట్వర్కింగ్ ఫేస్ బుక్‌లో సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి. 'పవన్ కళ్యాణ్ కనబడుట లేదు' అంటూ పోస్టింగులు చేస్తూ పలువురు ఆకట్టుకుంటున్నారు. ప్రజల తరుపున వారి సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించడానికే అంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయాడంటూ పలువురు విమర్శిస్తున్నారు.

రైలు చార్జీలు, సిమెంటు ధరలు, నిత్యావసర రేట్లు, త్వరలో పెరగనున్న బస్సు చార్జీల బాధుతులు.....రైతు, డ్వాక్రా రుణాల బాధితులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడంటూ ఫేస్ బుక్‌లో దర్శనిస్తోంది. ఆచూకి తెలిసిన వారు ఫేస్ బుక్‌లో పోస్టు చేయండి అంటూ సదేశాలు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తరుపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్....ఎన్నికల ఫలితాలతో పూర్తి సంతృప్తి చెందారు. అయితే ఆయన పలు సినిమాలకు కమిట్ కావడంతో ప్రస్తుతం ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగుల్లో బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ఆయన 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్.

జనసేన

జనసేన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ' స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ లక్ష్యం అధికారం కాదు...ప్రజల తరుపున ప్రభుత్వాలను ప్రశ్నించడమేనని పవన్ కళ్యాణ్ సభలు పెట్టి మరీ దంచి చెప్పడంతో పలువురు అభిమానులు ఆ పార్టీ వైపు ఆర్షితులయ్యారు.

జన సేన గురించి అభిమానులు

జన సేన గురించి అభిమానులు

ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడంతో....ఆయన మాటపై గౌరవం, అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని సైలెంటుగా ఉన్నారు ఫ్యాన్స్. ఎన్నికలు ముగిసాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ‘జన సేన' పార్టీ గురించిన ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.

ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు

ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు

ఇప్పటికైనా ‘జనసేన' పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో ప్రజల తరుపున ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ‘జన సేన' పార్టీ ఒక వేదికగా చేసుకోవాలని పలువురు ఫ్యాన్స్ ఉవ్విల్లూరుతున్నారు.

ఫ్యాన్స్ నిరాశ

ఫ్యాన్స్ నిరాశ

పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన విషయాలపై పెద్దగా దృష్టి పెట్టక పోవడంపై పలువురు ఫ్యాన్స్ నిరాశలో కూరుకు పోయారు. ఇప్పటి నుండే పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే 2019 నాటికి మంచి ఫలితాలు సాధించవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

English summary
According to Facebook post, Telugu people are waiting Pawan Kalyan to question about the recent hikes on Railway charges and petrol rates. They also want him to question about the promises made by Chandra Babu Naidu before elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu