»   » పవన్ సిగ్గు పడితే, ఆయనే కే ధైర్యం చెప్పి ముందుకు తోసిందట

పవన్ సిగ్గు పడితే, ఆయనే కే ధైర్యం చెప్పి ముందుకు తోసిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌కు ఓ విషయంలో తానే ధైర్యం చెప్పి,ముందుకు తీసుకెళ్లానంటోంది చెన్నై బ్యూటీ సమంత. వారిద్దరూ కలిసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'అత్తారింటికి దారేది' సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను పంచుకుంటూ ఇలా శెలవిచ్చింది సమంత.

సమంత మాట్లాడుతూ... 'పవన్‌ కల్యాణ్‌ గారికి సిగ్గు బాగా ఎక్కువ. 'అత్తారింటికి దారేది'లోని ఓ పాట కోసం అంతా కలిసి స్విట్జర్లాండ్‌ వెళ్లాం. మొదట్లో అక్కడ పెద్దగా జనం లేరు. కానీ, షూటింగ్‌ జరుగుతున్న కొద్దీ జనాలు విపరీతంగా వచ్చేశారు. వాళ్లని చూసి డ్యాన్స్‌ వేయడానికి పవన్‌ సిగ్గుపడిపోయారు. నేను డ్యాన్స్‌ చేయలేనంటూ కార్‌వేన్‌లోకి వెళ్లి కూర్చుండిపోయారు. నేను లోపలికి వెళ్లి ఎంతగానో బతిమాలాను.

Pawan Kalyan is Very Special: Samantha

అలాగే 'ఎంతమంది ఉన్నా మీరు స్టెప్పులు వేయగలరు అంటూ ధైర్యం చెప్పాను. అప్పుడు పవన్‌ సార్‌ బయటకు వచ్చి డ్యాన్స్‌ చేశార'అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎంతమంది స్టార్లతో కలిసి పనిచేసినా అందులో పవన్‌ చాలా స్పెషల్‌ అంటూ పొగిడేసింది. ఆయన హుందాతనం, సింప్లిసిటీ తనకు ఎంతగానో నచ్చుతాయని చెప్తూ వచ్చింది సమంత. అవునూ ఇప్పుడు సమంత హఠాత్తుగా పవన్ గురించి ఇలా ఎందుకు రివీల్ చేసింది చెప్మా.

English summary
In a recent interview, Samantha reveals an interesting incident which took place during the shoot of 'Atharintiki Daredi' - out and shot for the song. I couldn't forget that incident forever'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu