twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ అభిప్రాయం: పవన్ కళ్యాణ్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధ, అయోమయ పరిస్థితుల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, కొత్త పార్టీ పెడితే బాగుంటుందని గత కొంత కాలంగా తెలుగునాట చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఈ అంశానికి మసాలా జోడించి మరింత హైప్ తెచ్చారు.

    కాగా....సోషల్ నెట్వర్కింగులో పవన్ కళ్యాణ్‌పై తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుంది? అనే అంశంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. నీతివంతమైన పాలన, నీతి వంతమైన రాజకీయాలే లక్ష్యంగా మాజీ ఐఏఎస్ అధికారి కేజ్రీవాల్ నెలకొల్పిన 'ఆమ్ ఆద్మీ పార్టీ' ఢిల్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించాల్సిన అవసరం ఉందని, పవన్ కళ్యాణ్ దానికి నేతృత్వం వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పవన్ అభిమానులు ఈ అంశాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సోషల్ నెట్వర్కింగులో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది అభిమానులు 'ఆమ్ ఆద్మీ పార్టీ' పగ్గాలు ఏపీలో పవన్ కళ్యాణ్ చేపడితే బాగుంటుందని, ఇదే ఆయన రాజకీయ ఎంట్రీకి పర్ ఫెక్ట్ టైం అని కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

    పవన్ కళ్యాణ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీపై ఆసక్తి ఉందా? అసలు రాజకీయాలపై ఇంట్రస్టు ఉందా? అనేది ఇపపటికీ ప్రశ్నార్థకమే. అయితే అభిమానుల అభిప్రాయాలకు అనుగుంగా స్టార్స్ మారిన సందర్భాలు అనేకం. గతంలో చాలా మంది స్టార్స్ అభిమానుల కోరిక మేరకే రాజకీయాల్లోకి వచ్చిన వారే. మరి అభిమానుల ఆకాంక్ష పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో? అసలు స్పందిస్తారా? అనేది కాలమే తేల్చాలి. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

    English summary
    After making grand debut to politics, Aam Aadmi Party is now willing to enlarge their party to other states. Power Star Pawan Kalyan is one of rarest celebrities best concern about society. In fact, he wanted to serve people through his brother Chiranjeevi initiated Praja Rajyam Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X