twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ లో పవన్...అక్కడా రికార్డే

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన తొలి ట్వీట్‌ చేశారు. అలా అకౌంట్‌ ప్రారంభించగానే వేల మంది అభిమానులు ఆయనను ఫాలో అవడం ప్రారంభించారు. ట్విట్టర్‌ సైతం ఆయన అకౌంట్‌ను వెరిఫై చేయడం విశేషం. ఆయన ట్విట్టర్ ఐడి..

    ట్విట్టర్ లో పవన్

    ఆయన చేసిన ట్వీట్ ఇది...

    పవన్ ఖాతాను తెరిచిన గంటలోనే ఎనిమిదివేలమంది ఫాలోవర్లు ఫాలో అయ్యి రికార్డు క్రియేట్ చేసారు. ఆ ఫాలో వర్స్ సంఖం గంట గంటకీ పెరుగుతూనే ఉంది. ఇక ఇటీవల కొచ్చాడియన్ విడుదల తరువాత రజినీకాంత్ ట్విట్టర్ ఖాతాను తెరిచిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో ట్విట్టర్ లో తన ఖాతాను ప్రారంభించారు. తన అభిమానులకు మరింత చేరువ కావాలి అంటే తప్పకుండా తనకు ట్విట్టర్ లో ఖాతా ఉండాలని భావించిన పవన్ ట్విట్టర్ లో చేరిపోయారు.

     Pawan Kalyan joins Twitter...record

    పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' విశేషాలకు వస్తే...

    వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ కలసి నటించిన చిత్రమిది. కిషోర్‌ కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకుడు. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. జనవరి 1న 'గోపాల గోపాల' తొలి గీతాన్ని విడుదల చేశారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన 'బాజే.... బాజే' గీతాన్ని గురువారం సాయంత్రం 5 గంటలకు యూ ట్యూబ్‌లో ఉంచారు.

    ఈ గీతాన్ని అనంత శ్రీరామ్‌ రచించారు. ఈ ఆల్బమ్‌లో పవన్‌కు బాగా నచ్చిన పాట ఇదేనట. ఈ పాట విని అనూప్‌ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వెంకీ, పవన్‌లు కలసి ఈ పాటలో స్టెప్పులేస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న 'గోపాల గోపాల'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌

    చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... శ్రీకృష్ణుడి లీలలు ఎన్నని చెప్పేది..? ప్రేమతో పిలిస్తే ప్రాణం బదులిస్తాడు. యుద్ధంలో రథంతోలి నీతిని గెలిపించాడు. కన్నెల చీరలు, ముంతలో వెన్నలూ దోచుకెళ్లాడు. నివ్వెరపోయే అద్భుతాలు చూపించాడు. ఈసారి తన ఉనికినే నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చి భూమ్మీదకు దిగి వచ్చాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెలియాలంటే 'గోపాల గోపాల' చూడాల్సిందే అంటన్నారు.

    అలాగే..‘గోపాలగోపాల' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ఉపయోగించిన బైక్‌ను వేలం వేసేందుకు నిర్మాతలు సురేష్‌బాబు, శరత్‌ మారర్‌లు. సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్‌కి ఓ ప్రత్యేకమైన బైక్‌ను డిజైన్‌ చేశారు. ఇప్పటీకే పవన్‌, వెంకీలు ఈ బైక్‌పై వెళ్తున్న స్టిల్‌ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.

    చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాడిన బైక్‌లు, కత్తులు, పలు రకాల వస్తువులు వేలం వేయటం అనవాయితీగా మారింది. అదే కోవలో ఈసారి పవన్‌ ఉపయోగించిన బైక్‌ను వేలం వేయడానికి చిత్ర నిర్మాతలు సిద్దమయ్యారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. అయితే బైక్‌ను సినిమా విడుదల తర్వాత వేలం వేయాలా...లేక రిలీజ్‌కు ముందు వేలం వేయాలా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Pawan Kalyan joined Twitter to make his presence felt on the digital world. In his first tweet, "Wishing you all a very Happy New Year! Peace and Good Health," he wrote. Producer Sharath Marar confirms PawanKalyan is the official Twitter handle of his good friend Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X