»   » సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)

సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలు తప్ప... ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. చిత్ర యూనిట్ కూడా ఎందుకనో హీరోయిన్ కాజల్ మ్యాటర్ సస్పెన్స్ గానే ఉంచుతూ వస్తోంది. ఎట్టకేలకు హీరోయిన్ కాజల్ పవన్ కళ్యాణ్ తో సెట్స్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది.

ఈ చిత్రంలో కాజల్ యువరాణి పాత్రలో కనిపించబోతోంది. పవన్ కళ్యాణ్ తో కాజల్ నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ మధ్య కాలంలో కాజల్ హీరోయిన్ గా చాలా వెనక బడిపోయింది. ఈ సినిమా తర్వాత తన కెరీర్ మరింత స్పీడందుకుంటుందని కాజల్ భావిస్తోంది. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర (బాబీ)దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పవన్ నటించి ‘గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించడంతో మరోసారి ఆయన పోలీస్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రతన్‌పూర్ పోలీసుగా కనిపించబోతున్నారు. సంఘవిద్రోహ శక్తులకు, అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రతన్ పూర్ అంటే సామాన్యులతో పాటు పోలీసులు సైతం భయపడిపోతుంటారు. అలాంటి ఊర్లో పోలీసు ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఏం చేసాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథ.


స్లైడ్ షోలో పవన్-కాజల్ ఫోటోస్


పవన్-కాజల్

పవన్-కాజల్

ఎట్టకేలకు హీరోయిన్ కాజల్ పవన్ కళ్యాణ్ తో సెట్స్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది.


ప్రిన్సెస్

ప్రిన్సెస్

ఈ చిత్రంలో కాజల్ యువరాణి పాత్రలో కనిపించబోతోంది.


తొలి చిత్రం

తొలి చిత్రం

పవన్ కళ్యాణ్ తో కాజల్ నటిస్తున్న తొలి సినిమా ఇది.


నిర్మాణం

నిర్మాణం

ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిరిస్తున్నారు.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.


శరత్ మరార్

శరత్ మరార్

ఈ సందర్భంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్ ఈ చిత్రంలో తన దైన స్టైల్ లో అలరిస్తాడని తెలిపారు.


అన్ని

అన్ని

యాక్షన్, సెంటిమెంట్, వినోదంతో పాటు వాణిజ్య హంగులన్ని ఉంటాయని తెలిపారు.


పవన్ యాక్షన్

పవన్ యాక్షన్

పవన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయి.


కేరళలో

కేరళలో

ప్రస్తుతం కేరళలో పవన్‌ కళ్యాణ్, ఇతరచిత్ర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం, మరో మూడు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తవుతుందని తెలిపారు.


నెక్ట్స్ హైదరాబాద్

నెక్ట్స్ హైదరాబాద్

సర్దార్ గబ్బర్ సింగ్ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.


ఆడియో

ఆడియో

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోను మార్చిలో రిలీచేసి, ఏప్రిల్ 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

శరత్ ఖేల్కర్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: అర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, కళాదర్శకత్వం: బ్రహ్మ కడలి.


లక్ష్మీరాయ్

లక్ష్మీరాయ్

ఈ చిత్రంలో హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.English summary
Kajal Aggarwal shared a picture of hers with Pawan Kalyan on her official Instagram account, to the joy of her fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu