»   » రేపే పవన్ కళ్యాణ్ ... ఫ్యాన్స్ తో మీటింగ్, ఏం మాట్లాడతారో

రేపే పవన్ కళ్యాణ్ ... ఫ్యాన్స్ తో మీటింగ్, ఏం మాట్లాడతారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నేడు లండన్ వెళ్లనున్నారు. రేపు(8 వ తేదీన) అక్కడ ఆయన లాండ్ అవుతారు. అలాగే అక్కడ అభిమానులతో ఆయన ఇంటారాక్ట్ అవనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. లండన్ అభిమానులంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ అభిమానుల సమావేశంలో ఆయనేం మాట్లాడనున్నారు అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది. పొలిటికల్ వ్యూస్ మాట్లాడతారా లేక సినిమాలు గురించి చర్చిస్తూ క్యాజువల్ గా మీట్ అవుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే తమ జనసేన పార్టీ బలోపేతం చేయటానికి అక్కడనుంచి కూడా సపోర్ట్ తీసుకునేందుకే పవన్ వారిని కలుస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడటం విశేషం.

ఇక తదనంతరం పవన్ .. యూకేలో జరిగే తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనున్నారు యూకే తెలుగు అసోసియేషన్ పిలుపు మేరకు ఆయన హజరవుతున్నారు. దాంతో యూకేలో పవన్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

pawan kalyan

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేష్ (యుక్తా) ఆధ్వర్యంలో జరుగుతున్న "జయతే కూచిపూడి" ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.

యూకే, యూరప్ లోని తన అభిమానులు ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమంలోనూ భాగస్వామ్యులు కానున్నారు. 'యుక్తా'కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.

ఈస్ట్ లండన్ లోని యూకేలోని ట్రాక్సీలో 9వ తేది సాయింత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు జాతిపై అభిమానంతో ఈ కార్యక్రమానికి పవన్ కాళ్యాణ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు.

దాదాపు 2000 మంది ఎన్ఆర్ఐ కుటుంబాలు పాల్గొనబోతున్న ఈ కార్యక్రమంలో పవన్ చేత కూచిపూడి కళాకారులను సన్మానించనున్నారు. మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొననుండడంతో వేడుకను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.

సాధారణంగా...ప్రైవేటు కార్యక్రమాలకు చాలా అరుదుగా హాజరయ్యే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ లో పాల్గొనటంతో . దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తోంది. ఈ అరుదైన అవకాశమే 'యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం' వారికి దక్కటంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే పవన్ రంగ ప్రవేశం చేయనున్నారన్న వార్తతో ఈ కార్యక్రమానికి మునుపెన్నడూ లేనంత భారీ ప్రచారం కూడా జరుగుతోంది.

English summary
Pawan Kalyan will be landing in London on 8th and will also interact with his fans there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu