ఒక్కరు కాదు..ఇద్దరు : పవన్‌కల్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా పిలిచారు,పండగే
‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’ లో పవన్ తో పాటు, త్రివిక్రమ్ కూడా పాల్గొంటున్నారు.
హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న 'ఇండియా కాన్ఫరెన్స్ 2017'లో పాల్గొనేందుకు సినీ నటుడు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. విద్యార్థులు నిర్వహించే ఈ సదస్సులో పవన్‌కల్యాణ్ పాల్గొని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
బోస్టన్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి నెలలో 'ఇండియా కాన్ఫరెన్స్ 2017' నిర్వహించనున్నారు.

దీనికి హాజరు కావాల్సిందిగా పవన్‌కు సదస్సు నిర్వాహకులు ఆహ్వాన పత్రాన్ని పంపారు. పవన్ ఈ సదస్సుకు హాజరైతే ఫిబ్రవరి 11 లేదా 12న ప్రసంగించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. తమ అభిమాన హీరో, దర్శకుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే సదస్సుకు హాజరవుతారన్న సమాచారం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.
పవన్‌కల్యాణ్ ప్రస్తుతం కిషోర్ కుమార్ పార్థసానీ(డాలి) దర్శకత్వంలో 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంతో సహా టీఆర్ నేసన్ దర్శకత్వంలో పవన్ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











