»   » పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కిస్

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కిస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అడవి శేషు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'కిస్'. 'కిస్' అంటే 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. అడవి సాయికిరణ్ మైడ్రీమ్స్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, థౌజండ్ లైట్స్ సినిమా చిత్రం పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ కూడా విడుదలైంది.

ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారట. వీరిద్దరు కలిసి ఒకే చిత్రంలో కనిపించడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా?. ఇందులో ఆశ్యర్య పోవడానికి ఏమీ లేదండీ. దర్శకుడు, హీరో అడవి శేషు ఈ ఇద్దరు స్టార్ల అభిమానులను తన సినిమా వైపు ఆకర్షించడానికి....పంజా, దూకుడు చిత్రాల్లోని సీన్లు ఈ చిత్రంలో పెట్టాడట.

ఆవిధంగా ఈ స్టార్స్ ఇద్దరు 'కిస్' సినిమాలో కనిపించబోతున్నారన్నమాట. గతంలో అడవి శేషు 'పంజా' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కిస్ ఆడియోని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియో‌లో పెట్టాలని అనుకోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఈ సినిమా ఆడియోని జూన్ 22 తేదిన లేదా 23 తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి అడవి శేషు మాట్లాడుతూ- సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన ట్రాక్స్ అద్భుతంగా కుదిరాయని, ముఖ్యంగా రీ రికార్డింగ్ అందరికీ నచ్చుతుందని తెలిపారు. సినిమాలో పాటలు అందరికీ నచ్చుతాయని తాను ఆశిస్తున్నట్లుగా శ్రీచరణ్ పాకాల తెలిపారు. క్వాలిటీ వీడియోగా ఆర్.ఆర్.ట్రాక్స్‌తో కలిసి ఈ పాటలను ప్రేక్షకులకు అందిస్తున్నామని నిర్మాత సాయికిరణ్ అడవి తెలిపారు.

English summary
Power Star Pawan Kalyan and Super Star Mahesh Babu will be seen together in a small time movie Kiss starring Adivi Sesh. The actors are not part of the romantic entertainer. Krish will be adding few clips of Mahesh’s ‘Dookudu’ and Pawan Kalyan’s ‘Panjaa’ in Kiss to attract the attention of fans of both the stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu