For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హరిహర వీరమల్లుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్న పవన్.. మళ్ళీ మొదలైన సిట్టింగ్స్

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు అగ్ర హీరోలందరి కూడా మిగతా భాషల్లో కూడా పట్టు సాధించాలని భారీ బడ్జెట్ తో రాబోతున్నారు. ఇక వాళ్లు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటారో గాని తప్పకుండా ఎంతో కొంత హైప్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి పాన్ ఇండియా దారిలో అడుగులు వేయడం చర్చనీయాంశంగా మారింది.

  ఇంతవరకు మిగతా భాషల పై పెద్దగా ఫోకస్ పెట్టని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో మాత్రం పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసుకోవాలని అడుగులు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే తన శక్తి మేరకు కష్టపడుతున్నాడు.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపును అందుకున్న దర్శకుడు క్రిష్ మొదటి సారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలా సార్లు ఈ దర్శకుడితో సినిమా చేయాలని పవన్ అనుకున్నారు. రెండుసార్లు కథలపై చర్చలు కూడా జరిగాయి. ఇక ఫైనల్ గా క్రిష్ ఒక హిస్టారికల్ కథను చెప్పి మెప్పించాడు. ఇక ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది.

  Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

  ఖుషి నిర్మాత ఏఎమ్.రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా కొన్ని వారాల క్రితం ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కాలేదు. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను కూడా మళ్ళీ సెట్స్ పైకి తీసుకువచ్చి త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు.

  Pawan kalyan meeting with hari hara veeramallu director and producer

  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ ఎక్కువగా హరిహర వీరమల్లు సినిమాపైనే ఫోకస్ పెట్టుకున్నాడు. ఇక వీలైనంత త్వరగా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఇటీవల దర్శకుడితో అలాగే నిర్మాతతో కూడా చర్చలు జరిపాడు. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డేట్స్ ఫిక్స్ చేసుకొని రావాలని వివరణ ఇచ్చాడట. ఇక షూటింగ్ ఈ ఏడాది తుది దశకు చేరుకునే సమయానికి పూర్తవ్వాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  Indian Idol fame Shanmukhapriya కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

  హరిహర వీరమల్లు సినిమాను మొదట 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ వాయిదా కారణంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అఫీషియల్ గా పోస్టర్ ద్వారా క్లారిటి కూడా ఇచ్చేశారు. ఈ డేట్ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పనులను కొనసాగించాలని అనుకుంటున్నారు.

  అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు

  అలాగే పవన్ కళ్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ సినిమా తో కూడా బిజీ కావాలని అనుకుంటున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరిగాయి. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కు వివరణ ఇచ్చాడు. మరి ఆ దర్శకుడు పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి ప్లాన్స్ సెట్ చేస్తాడో చూడాలి.

  English summary
  Pawan kalyan meeting with hari hara veeramallu director and producer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X