»   »  రామోజీతో పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు?

రామోజీతో పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావుతో సీక్రెట్ మీటింగ్ కావడంతో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ చిత్రీకరణ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామోజీరావుతో పవన్ భేటీ అయినట్లు సమాచారం.

'సర్దార్' ఇంట్రడక్షన్ సీన్ ఇదేనా! (లీక్ ఫోటోస్)

ఈ భేటీలో రామోజీరావు, పవన్ కళ్యాణ్ పలు వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు, ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వివాదాల, ఈ మధ్య కాలంలో హైలెట్ అయిన రాజధాని భూదాందాపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఎవరూ తలదించుకునేలా చేయనంటున్న నాగబాబు కూతురు

ఈ అంశాల తర్వాత పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు సంబంధించిన విషయాలపై చర్చ జరిగిన్లు తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో వందలాది గుర్రాలు, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో తీస్తున్న భారీ సన్నివేశం గురించి చర్చ జరిగినట్లు సమాచారం.

 Pawan Kalyan Meets Ramoji Rao

100 గుర్రాల సీన్....
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో 100 గుర్రాలతో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మాతలు. 'సర్దార్‌' కోసం చిత్రబృందం ఇప్పుడో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కించనుంది. ఇందుకోసం వంద గుర్రాలు, బోలెడన్ని ఖరీదైన కార్లు వాడుతున్నారట.

కేవలం గుర్రాలు, కార్లు మాత్రమే కాదు.....వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు, నలభైమంది ప్రధాన తారాగణంతో ఈ యాక్షన్ సీన్ ఉంటుందట. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో సన్నివేశాల చిత్రీకరణ జరిపిన సినిమా 'బాహుబలి' మాత్రమే. ఇపుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని అంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్ గా ఉంటుందట.

'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Source said that, Recently when Pawan Kalyan was shooting for Sardaar in Ramoji Film City, Ramoji Rao paid visit to Sardaar sets and interacted with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu