»   » పవన్ ‘గబ్బర్‌ సింగ్’చిత్రం కొత్త పోస్టర్ కబుర్లు

పవన్ ‘గబ్బర్‌ సింగ్’చిత్రం కొత్త పోస్టర్ కబుర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‌'గబ్బర్‌ సింగ్"చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొత్త పోస్టర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరుమోతు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ని రూపొందించారు. ఇక ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది. సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'మిరపకాయ్" వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ ‌శంకర్ 'గబ్బర్ ‌సింగ్" చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ ‌శంకర్. పవన్ ‌కళ్యాణ్‌తో 'తీన్ ‌మార్" వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గణేష్‌ బాబు ఈ 'గబ్బర్ ‌సింగ్" చిత్రాన్ని నిర్మించటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

English summary
Pawan is known for pulling off mass friendly roles and Gabbar Singh character provides him the best scope to rule the roost. This film’s shooting will start from July and the film will be ready for release by coming Pongal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu