»   » నేను సినిమాల్లేకపోతే సన్నబడిపోతాను: పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్

నేను సినిమాల్లేకపోతే సన్నబడిపోతాను: పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'ఛల్ మోహ‌న్‌ రంగ‌'. శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, నితిన్ మధ్య ఫర్నీ కన్వర్జేషన్ చోటు చేసుకుంది.

నితిన్ మాట్లాడుతూ... మీకూ, నాకూ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ మీరే యంగ్‌గా, స్లిమ్‌గా కనబడుతున్నారు అని వ్యాఖ్యానించారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.... నేను సినిమాల్లేకుంటే సన్నబడిపోతాను, నాకు పెద్దగా కోరికలు ఏమీ ఉండవు. సినిమాలుంటే చాలా బరువు. ఇపుడు తినే అవకాశం రాలేదు అని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan & Nithiin Funny Conversation

సార్ మీరు నాకు చాలా సెంటిమెంట్. ఇష్క్ వేడుకకు వచ్చారు, గుండె జారి గల్లంతయిందే చిత్రానికి మీరు విషెస్ పంపారు. 'అ..ఆ' కు వచ్చారు, ఈ సినిమాకు మళ్లీ వచ్చారు. ఈ సినిమా హిట్ కావాలని ఆశీర్వదించండి అంటూ నితిన్ కోరగా... పవన్ కళ్యాణ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

English summary
Pawan Kalyan & Nithiin Funny Conversation at Chal Mohan Ranga Pre Release Event on Sreshth Movies. Pawan Kalyan Creative Works and Sreshth Movies Present ChalMohanRanga 2018 Telugu Movie ft. Nithin / Nitin & Megha Akash. Produced by Pawan Kalyan & Sudhacar Reddy. Story by Trivikram. Music by Thaman S.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X