»   » అయినా సరే..ఆగను: రాజకీయ మూలాలు, ప్యూచర్ ఫ్లాన్స్ గురించి పవన్ స్పష్టంగా

అయినా సరే..ఆగను: రాజకీయ మూలాలు, ప్యూచర్ ఫ్లాన్స్ గురించి పవన్ స్పష్టంగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఊహించని విధంగా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వూలలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి ,పొలిటకల్ కెరీర్ మీద కాన్సంట్రేట్ చేయాలనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చిన సంగతి తెలిసిందే.

అందుకోసం ఆయన జన సేన అనే పార్టిని స్దాపించారు. అయితే ఆయన రాజకీయపరమైన ఆలోచనలకు, ఐడియాలజీకి మూలం ఏమిటి...అంటే తనకు చిన్నప్పుడే అందుకు తగిన బీజాలు పడ్డాయని రీసెంట్ గా ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వూలో తెలియచేసారు.

ప్రస్తుతం ఎస్ జె సూర్యతో తను చేయబోయే చిత్రం విషయమై ఫామ్ హౌస్ లో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితానికి రూట్స్ ఏమిటో చెబుతూ తన రాజకీయ జీవితంలో ప్యూచర్ ఫ్లాన్స్ వంటివి చర్చించారు.

ఆ విశేషాలు క్రింద స్లైడ్ షోలో ...

పెద నాన్నగారు మాటలతో..

పెద నాన్నగారు మాటలతో..

పవన్ మాట్లాడుతూ.."మా పెదనాన్నగారు (నాన్న అన్న) కమ్యూనిజం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. స్టూడెంట్ గా ఉండేటప్పుడు అనేక ప్రదేశాలు తిరిగేవాళ్లమని చెప్పారు. ఆయనతో మంచి అనుబంధం ఉండేదని చెప్పారు

అప్పట్లోనే..

అప్పట్లోనే..

నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నా ఎదురుగా...కరెంట్ ఇష్యూస్,అందులో ఎక్కువగా పొలిటికల్ టాపిక్స్ డిస్కస్ చేసేవారు. అప్పుడే నాకు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని ఉండేది అని పవన్ చెప్పారు. అప్పుడే తనలో బీజం పడిందని చెప్పారు.

స్కూల్ డేస్ లో

స్కూల్ డేస్ లోస్కూల్ లో చదువుకునేటప్పుడు అనేక దేశభక్తి పాఠాలు, చరిత్ర పాఠాలు నన్ను ప్రేరేపించేవి

టీచర్స్ ...

టీచర్స్ ...

ఆ పాఠాలని మా సోషల్, సైన్స్ టీచర్స్ చెప్పిన విధానం కూడా అంత గొప్పగా ఉండేది. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ఆ వయస్సులో...

ఆ వయస్సులో...

అలా నేను ఎదుగుతుున్న క్రమంలో...నా మనస్సులో ఆ ఆలోచనలు బలం అవటం ప్రారంభించాయి. అప్పుడే నేను ఏదో ఒకటి అవ్వాలి అనుకునేవాడిని

గ్రాడ్యువేషన్ తర్వాత

గ్రాడ్యువేషన్ తర్వాత

తన గ్రాడ్యువేషన్ పూర్తైన తర్వాత ఇష్యూలను రైజ్ చేసి, తను పాలిటిక్స్ లోకి రావాలని అనుకునేవాడినని చెప్పారు.

మా అన్నయ్య కంగారుపడేవారు

మా అన్నయ్య కంగారుపడేవారు

అప్పట్లో నేను కేవలం ఇవే ఆలోచనలతో తిరుగుతూంటే మా అన్నయ్య చిరంజీవి నేను తప్పుజు దారిలోకి వెళ్తానేమో అని భయపడేవారు. అందుకే ఆయన నన్ను సినిమాల్లోకి తీసుకు వచ్చారు.

కానీ నాకు తెలుసు

కానీ నాకు తెలుసు

"కానీ, నాకు తెలుసు నా అసహనం, కోపం, న్యాయం కావాలనుకునే మనస్వత్వం నన్ను రాజకీయాల్లోకి తీసుకు వస్తాయని "

నా కోపాన్ని

నా కోపాన్ని

నాలో ఉన్న ఆగ్రహాన్ని నేను నా సినిమాల ద్వారా ప్రదర్శించేవాడ్ని

ఎన్నో డైలాగులు

ఎన్నో డైలాగులు

నేను సినిమాల్లో డైలాగులు విన్నప్పుడల్లా, నన్ను నేను ప్రశ్నించుకునేవాడ్ని, నేను నిజ జీవితంలో ఎందుకు చేయలేకపోతున్నాను అని..

ఎంతో ప్రెజర్

ఎంతో ప్రెజర్

నేను ఎంతో ఒత్తిడితో ఉండేవాడ్ని, భయపడేవాడ్ని, ఏదైతే అది అయ్యింది, మంచైనా, చెడైనా, నేను స్ట్రాంగ్ ఉండి పోరాడాలని డిసైడ్ అయ్యాను.

కామన్ మ్యాన్

కామన్ మ్యాన్

నా ఆలోచనలు ఎప్పుడూ ఓ సాధారణ వ్యక్తిలాగే ఉంటాయి తప్ప ఎప్పుడూ పెద్ద స్టార్ గా అనిపించవు, ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారని భావించను.

విలేజెస్ లో కి

విలేజెస్ లో కి

తను స్థాపించిన 'జనసేన' పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజమా

నిజమా

ప్రస్తుతం పవన్ ...పార్టీ నిర్మాణానికి ..అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు

అంత అవసరమే మరి

అంత అవసరమే మరి

పార్టీ నిర్మాణం కోసం...రాబోయే రెండు,మూడేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలను సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అవన్నీ

అవన్నీ

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలా... ఇలా ఎంతోమంది గొప్పవాళ్లు. వాళ్ల జీవితాల గురించి తెలుసుకొంటున్నప్పుడు కొన్నింటిని నా జీవితానికి అన్వయించుకొంటుంటా. ఆ భావాలన్నీ నాలో పాతుకుపోయాయి.

తదుపరి చిత్రం

తదుపరి చిత్రం

పవన్ తన తదుపరి చిత్రం ఈ నెలాఖరున కానీ, మేలో కానీ ఆ చిత్రం మొదలవుతుంది. హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే ఫ్యాక్షన్‌ ప్రేమకథ ఇది.

‘వేదాళం' రీమేక్‌

‘వేదాళం' రీమేక్‌

ఇక వేదాళం రీమేక్‌ విషయానికొస్తే ఆ చిత్రం విషయంలో చర్చలు నడుస్తున్నాయి కానీ... అది చేస్తానా లేదా అని మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఎ.ఎమ్‌.రత్నంగారి నిర్మాణంలో మాత్రం సినిమా తప్పకుండా చేస్తా.

అన్నయ్య అప్పుడు మాత్రమే...

అన్నయ్య అప్పుడు మాత్రమే...

జనసేన పార్టీ విషయంలో అన్నయ్య వద్దు అని చెప్పలేదు కానీ... ‘నీకెందుకురా రాజకీయం, ఎందుకు ఈ గొడవలు. ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చుగా' అన్నారంతే. అది కూడా వేరే వాళ్లతో చెప్పించారంతే.

సర్దార్ సెటిల్ మెంట్

సర్దార్ సెటిల్ మెంట్

ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్, సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాఫ్ నిమిత్తం ..పవన్ ఏమన్నా చెయ్యబోతున్నారా అనేది..ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

English summary
“I heard many dialogues in films, and I asked myself why couldn’t I do the same in real life? Initially, I was under lot of pressure and was also scared. But I decided to face whatever came, whether good or bad, and stay strong,” says the Pawan Kalayn. “Even now my thoughts are like that of a common man and I never feel that I am a big star and that people adore me,” he adds.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu