twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ అభిమానులుకు శుభవార్త

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన చిత్రాలను ప్రమోట్ చేయటానకి ప్రత్యేక ఇంటర్వూలు అవీ ఇవ్వటానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఆయన పంజా చిత్రం కోసం ఓ ఇంటర్వూని ఇస్తున్నారు. దాన్ని నిర్మాతలు షూట్ చేయించి యూ ట్యూబ్ లో పెడుతున్నారు. ఈ మేరకు షూటింగ్ కూడా అయ్యిందని,ఎడిటింగ్ చేసి,ట్రిమ్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తారని,టీవీ ఛానెల్స్ కి ఇస్తారని తెలుస్తోంది. ఇది ఈ సినిమా ఓపినింగ్స్ కు,అలాగే సినిమాపై అంచనాలు ఏర్పడటానికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

    తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ...ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు.

    కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.

    English summary
    Pawan special interview on Panjaa will be be available on youtube very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X